పాతబస్తీలో వివాహిత హత్య మిస్టరీని చేధించిన పోలీసులు, భర్తే నిందితుడు

హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్‌పూర్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో గోనేసంచిలో మహిళ మృతదేహానికి సంబంధించిన మిస్టరీని పోలీసలు చేధించారు. భర్తే ఆ మహిళను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పాతబస్తీకి చెందిన హైదర్ ఖాన్ తన మూడో భార్యను హత్య చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

పాతబస్తీలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. భర్తే ఆమెను హత్య చేసి రైల్వేట్రాక్ వద్ద పడేసినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం డబీర్‌పూర్‌ స్టేషన్‌కు కొద్ది దూరంలో బియ్యపు బస్తాలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Hyd. Police bust mystery death of woman in Old City

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఇద్దరు భార్యలను వదిలేసిన ఖాన్ మూడో భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు.

కాగా హత్య చేసిన అనంతరం ఖాన్ తన ఇద్దరు చిన్నారులతో పాటు దుబాయ్‌ పారిపోయాడు. హంతకుడి ఇంటికి వెళ్లిన పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ హత్య గురించి తనకు తెలియదని, అలాగే తన కొడుకు పిల్లలతో కలిసి ఎక్కడి వెళ్లారో తెలియదని హతుడి తల్లి పోలీసులకు తెలిపింది.

నిందితుడు ఇప్పటికే ఇద్దరు భార్యలను వదిలేశాడు. మూడో భార్యను హత్య చేశారు. అయితే ఇద్దరు భార్యలను అతను ఎందుకు వదిలేశాడనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+