దారుణం: అమీర్‌పేటలో టెక్కీ దారుణ హత్య, భార్య బంధువులపైనే అనుమానం!
హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధరంకరం రోడ్డులో కేశన చంద్రశేఖర్ రాజు(25)ను దుండుగులు కత్తులతో పొడిచి చంపారు. అతని భార్య తరపు బంధువులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టెక్కీ భార్య ఆత్మహత్య..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేశర్ రాజుతో మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి(22)కు 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు.. తన భార్యతో కలిసి అల్విన్ కాలనీలో కాపురం పెట్టాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1న లక్ష్మీగౌరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

భర్త, అత్తింటి వేధింపులతోనే..
భర్త, అతడి తల్లిదండ్రులు వరకట్నం కోసం వేధించడం వల్లే లక్ష్మీగౌరి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ తోపాటు అతడి తల్లిదండ్రులు కృష్ణారావు, ఝాన్సీలక్ష్మిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో జైలుకెళ్లిన చంద్రశేఖర్‌రాజు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, ప్రతివారం బాలానగర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి హాజరుకావాల్సి ఉండటంతో ధరంకరం రోడ్డులోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు.
Recommended Video

మాటువేసి హతమార్చారు..
ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చేందుకు కిందికి వెళ్లిన చంద్రశేఖర్ రాజుపై దాడి చేసిన నలుగురు దుండగులు.. అపార్ట్‌మెంట్ సెల్లారులోనే కత్తులతో పొడిచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రశేఖర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీగౌరి బంధువులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లభించిన ఆధారాలతో దర్యాప్తు చేపట్టి, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications