ఒక్కసారిగా కుప్పకూలి.. బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి: బండి సంజయ్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో.. ఆయనను సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కార్పొరేటర్ మృతి పట్ల ఆ పార్టీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.

కరుణాకర్.. రెండు సార్లు కార్పొరేటర్‍‌గా పనిచేశారని, ప్రజలందరికీ సేవ చేయాలన్న దృక్ఫథం ఉన్న వ్యక్తని బండి సంజయ్ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవించి ఆత్మీయంగా పిలుచుకునే వ్యక్తి నేడు లేడనే వార్త బాధిస్తుందని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దశబ్దాలుగా కృషి చేశారన్నారు.

 Hyderabad: BJP corporator Devara Karunakar passes away

కరోనా సమయంలోనూ పేద ప్రజలకు భోజన సదుపాయం, నిత్యవసర వస్తువులు విరివిగా దానం చేశారని బండి సంజయ్ అన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు పాల్గొనడమే కాకుండా పార్టీ కార్యకర్తలను, ప్రజలను భాగస్వామ్యం చేయడం.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కృషి ప్రశంసనీయమన్నారు.

దేవర కరుణాకర్ మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+