G.O.A.T.. దిగాడోచ్: హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు- ఈ రూట్ లో అస్సలు వెళ్లొద్దు

అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. భారత్ లో అడుగు పెట్టాడు. ఈ వేకువ జామున 2:25 నిమిషాలకు కోల్ కత చేరుకున్నాడు. లూయిస్ సువారెజ్ రోడ్రిగో డి పాల్ తో కలిసి వచ్చారు. ఎముకలు కొరికే చలిలోనూ ఇక్కడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వందలాది మంది అభిమానులు అతనికి ఘన స్వాగతం పలికారు. బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జాతీయ పతాకాలను చేతపట్టుకుని దారిపొడవునా కనిపించారు. 2011 తర్వాత మెస్సీ భారత్ కు రావడం ఇదే తొలిసారి.

హైదరాబాద్, ముంబై, ఢిల్లీల్లో పర్యటించనున్నాడు మెస్సీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోనున్నాడు. అలాగే- వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, బాలీవుడ్ ప్రముఖులతో భేటీ కానున్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం మెస్సీ హైదరాబాద్ కు రానున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ తో కలిసి ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. మెస్సీతో తలపడటానికి రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తూ వస్తోన్నారు రేవంత్.

Hyderabad Braces for Messi GOAT Tour as Traffic Advisory Issued

ఈ మ్యాచ్‌కు సంబంధించి రాచకొండ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11:50 వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఫలక్‌నుమా-ఉప్పల్ (సంతోష్‌నగర్ మీదుగా), సికింద్రాబాద్-ఉప్పల్ (హబ్సిగూడ మీదుగా) మార్గాల్లో వాహనాలను మళ్లించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.

తార్నాక నుండి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ వద్ద నాచారం, ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు. రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు వాహనదారులు స్ట్రీట్ నంబర్ 8 వద్ద ఇదే మార్గంలో వెళ్లాలి.

ఈవెంట్ కోసం మొత్తం 10 ప్రధాన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. వీటిలో తొమ్మిది మ్యాచ్ చూడటానికి వచ్చే వారికి కేటాయించారు. స్టేడియం నుండి కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి ఈ పార్కింగ్ స్థలాలు. ఒకటి వీవీఐపీలు, మరొకటి వీఐపీలు, అధీకృత పాస్ దారుల కోసం కేటాయించారు. స్టేడియం లోపలే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

పాస్‌లు లేని వాహనాలను ఏక్ మినార్, ఎల్జీ గోడౌన్ చెక్‌పోస్టులు దాటి అనుమతించరు. హబ్సిగూడ-ఉప్పల్ మార్గంలో పెంగ్విన్, టీజీఐఏఎల్ఏ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ గ్రౌండ్ లల్లో వాళ్లు తమ వాహనాలను పార్క్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

రామంతాపూర్-ఉప్పల్ మార్గంలో జైన్ పార్కింగ్, శాండ్ అడ్డా, మోడరన్ బేకరీ, వాసు ఫార్మా వద్ద పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

ఎల్బీ నగర్ వైపు నుండి వచ్చే సందర్శకులు జైన్ పార్కింగ్, శాండ్ అడ్డా, ఈనాడు ఆఫీస్ లేదా అగర్వాల్ పార్కింగ్‌లో తమ వాహనాలను నిలపాలి. హబ్సిగూడ నుండి వచ్చేవారు పెంగ్విన్, టిజి ఐఎఎల్ఎ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లేదా మున్సిపల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేసుకోవాలి.

రామంతాపూర్ నుండి వచ్చే వారు డీఎస్‌ఎల్ మాల్ వద్ద యూ-టర్న్ తీసుకున్న తర్వాత జైన్ పార్కింగ్, సాండ్ అడ్డా, ఈనాడు ఆఫీస్ లేదా అగర్వాల్ పార్కింగ్ సౌకర్యాలు వాడుకోవచ్చు. ఉప్పల్ భగాయత్ నుండి చేరుకునే వారు కూడా ఈ జైన్, సాండ్ అడ్డా, ఈనాడు ఆఫీస్ లేదా అగర్వాల్ సౌకర్యాలనే వినియోగించాలి.

లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎమ్‌సి ట్రక్కులు సహా అన్ని రకాల భారీ వాహనాల రాకపోకలపై మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11:50 వరకు ఆంక్షలు ఉంటాయి. ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వైపు భారీ వాహనాలను హెచ్‌ఎమ్‌డిఎ ఉప్పల్ భగాయత్ ప్రవేశ ద్వారం వద్ద నాగోల్, ఎల్‌బి నగర్ వైపు మళ్లిస్తారు.

ఎల్‌బి నగర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ యూ-టర్న్ వద్ద నాగోల్, హెచ్‌ఎమ్‌డిఎ భగాయత్, బోడుప్పల్, చర్లపల్లి (ఐఓసిఎల్) లేదా ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు.

వరంగల్ నుండి ఉప్పల్ మీదుగా హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌ (ఓఆర్ఆర్) తీసుకొని అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్‌బి నగర్, దిల్సుఖ్ నగర్ మీదుగా వెళ్లాలి.

హైదరాబాద్ నుండి వరంగల్ వైపు ఉప్పల్ మీదుగా వెళ్లే భారీ వాహనాలు ఎల్‌బి నగర్, హయత్‌నగర్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్ తీసుకోవాలని పోలీసులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+