పెళ్లి పత్రికలు పంచేందుకు హెలికాప్టర్‌లో పయనం: తమ్ముడిపై ప్రేమతో!

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త తన సోదరుడి వివాహ ఆహ్వాన పత్రికలను హెలికాప్టర్‌ను ఉపయోగించి పంఫిణీ చేశారు.

హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త వివాహ ఆహ్వాన పత్రికలు అందించి వార్తల్లో నిలిచారు. సాధారణంగా ఏ బస్సులోనో.. కారులోనే.. పెళ్లి పత్రికలు పంచితే.. వార్తల్లో నిలవరు కానీ.. ఏకంగా హెలికాప్టర్‌లో వివాహ పత్రికలు పంచడానికి వెళ్లారు కాబట్టే ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారవేత్త మధు యాదవ్.. తన తమ్ముడి వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే ఉపయోగించారు. ముంబైలో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లకు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెళ్లి పత్రికలు అందజేశారు.

Hyderabad businessman uses a helicopter for distributing his brother wedding cards

అయితే, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఆహ్వాన పత్రికిలు ఇవ్వాలంటే కొరియర్ ద్వారానో.. సందేశాల ద్వారానో, లేదంటే ఫోన్ చేసి చెప్పడం సాధారణంగా జరుగుతుంది. కానీ, ఈయన మాత్రం హెలికాప్టర్ ఉపయోగించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బంధువులందరికీ తమ్ముడి పెళ్లి పత్రికలను అందించి.. తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు మధు యాదవ్.

ఖైరతాబాద్ నివాసి అయిన మధు యాదవ్ దూద్‌వాలా డెయిరీ నిర్వహిస్తున్నారు. తన తమ్ముడు చందు యాదవ్ పెళ్లి మార్చి 9న జరగనుంది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ అద్దెకు తీసుకుని సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధు, మిత్రులకు తమ్ముడి వివాహ పత్రికలను అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+