హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు లక్షలల్లో నమోదవుతూ ఆస్పత్రులన్నీ నిండుకున్నాయి. విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకుతోడు సోనూ సూద్ లాంటి వ్యక్తులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు శక్తికిమించి పనిచేస్తున్నాయి. ఆథ్యాత్మిక సంస్థలు సైతం విస్తృతంగా సేవలు చేస్తున్నాయి. చాలా చోట్ల గురుద్వారా, మసీదుల్లో కొవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ ఓ చర్చి కొవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది..

చంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -'ఎన్440కే కరోనా వేరింట్'పై నోటీసులు -సీఎం జగన్‌కు సిగ్గులేదంటూచంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -'ఎన్440కే కరోనా వేరింట్'పై నోటీసులు -సీఎం జగన్‌కు సిగ్గులేదంటూ

 300 బెడ్లతో కొవిడ్ సెంటర్

300 బెడ్లతో కొవిడ్ సెంటర్

హైదరాబాద్ లోని ప్రఖ్యాత కల్వరి టెంపుల్ చర్చి ఇప్పుడు పూర్తిగా కొవిడ్ కేర్ సెంటర్ గా రూపాంతరం చెందింది. మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్‌ ప్రాంగణంలో అంకురా, థెరిస్సా ఆస్పత్రుల సౌజన్యంతో 300 పడకలు, 50 ఆక్సిజన్‌ బెడ్లతో కొవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీనిని శనివారం ప్రారంభించారు.

ఎమ్మెల్సీ కవిత సందేశం..

ఎమ్మెల్సీ కవిత సందేశం..

కొవిడ్ రోగుల కోసం కల్వరి టెంపుల్ చర్చి వ్యవస్థాపకుడు బ్రదర్‌ సతీశ్ కుమార్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్‌, నార్నె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం చర్చల చేపట్టిందని కవిత చెప్పారు. ప్రజలు కరోనా బారినపడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరించాలని ఆమె సూచించారు.

 ప్రార్థనా కేంద్రాలు అన్నిటినీ..

ప్రార్థనా కేంద్రాలు అన్నిటినీ..

కరోనా సెకండ్ వేవ్ భయానకంగా మారడం, ఆస్పత్రులన్నీ కిక్కిరిపోవడంతో కొద్ది రోజులుగా బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ధనిక ఆథ్యాత్మిక సంస్థలన్నీ ముందుకొచ్చి జనానికి సేవ చేయాలని, మతాలతో సంబంధంలేకుండా దేశంలోని ప్రార్థనా కేంద్రాలన్నిటినీ కొవిడ్ సెంటర్లుగా మార్చాలనే డిమాండ్ కొంతకాలంగా ఊపందుకుంది. హైదరాబాద్ లోని కల్వరి టెంపుల్ చర్చిని కొవిడ్ కేంద్రంగా మార్చేసిన విషయానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది.

బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదుబిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదు

Recommended Video

2-DG | How It Works On Human Cells And Fights Covid-19 || Oneindia Telugu

English summary
Amid a surge in Covid-19 cases in Hyderabad, Calvary Temple founded by Brother P Satish Kumar has been converted into a 300-bed Covid isolation centre. Calvary Temple is an evangelical non-denominational Christian mega-church in the city. telangana cm kcr's doughter, trs MLC Kalvakuntla Kavitha on Saturday inaugurated a 300-bed Covid isolation centre at Calvary Temple for the needy patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X