Hyderabad: ఛాంపియన్ ట్రోఫీ సంబరాలు.. పోలీసుల లాఠీఛార్జ్!
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై యువకుల సంబరాలు..!#Hyderabad #Dilsukhnagar #RohitSharma #ShreyasIyer #KLRahul #ViratKohli #INDvsNZ #ChampionsTrophy2025 #ChampionsTrophyFinal #CTwithOneindia #OITelugu pic.twitter.com/iZT3fKdP7U
— oneindiatelugu (@oneindiatelugu) March 9, 2025
పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆనందంతో డ్యాన్సులు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. టపాసులు కాల్చారు. హైదరాబాద్ ట్యాండ్ బండ్ ప్రాంతంతోపాటు ఇతర ఏరియాల్లో యువత టీమిండియా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన యువత టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేశారు.
Congress govt in Hyderabad,Telangana not allowing people celebrate #TeamIndia lead by #RohitSharma #ViratKohli fantastic victory in #ChampionsTrophy #ChampionsTrophyFinal #ChampionsTrophy2025 ? pic.twitter.com/d0qtJG1eHR
— KailashGWagh 🇮🇳 (@KailashGWagh) March 9, 2025
దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని పలు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, యువకులు మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు యువకులు వాహనాలపై ఎక్కి డ్యాన్సులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అక్కడ్నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని అక్కడ్నుంచి తరిమేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

టీమిండియాపై ప్రముఖుల ప్రశంసలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ను టీమిండియా కైవసం చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ సాధించడంతో పటాసులు కాలుస్తూ,స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
'అసాధారణ మ్యాచ్.. అపూర్వ విజయం' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ టీమిండియాను ప్రశంసించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. టోర్నమెంట్ అసాంతం అద్భుతంగా ఆడారంటూ భారత ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తారు. టీమిండియా ఆటగాళ్లందరికీ ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.
HYDERABAD CELEBRATION! 🏆🇮🇳#ChampionsTrophyFinal 🎇🥁 pic.twitter.com/iPdw10ekD8
— Revanth Reddy (@revanthreddy_67) March 9, 2025
ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. టీమిండియాకు శుభాకాంక్ష్లలు' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
కాగా, న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2013లో ఇంగ్లాండ్ ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications