వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి: కోవింద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

హైదరాబాద్ అంటే బిర్యానీ, బాహుబలి

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం స్థానిక పరిమళాలను వెదజల్లింది.

తెలుగు సాహిత్యంలోని వైతాళికులను గుర్తు చేస్తూ, తెలుగు సాహిత్య మహత్వాన్ని చాటుతూ ఆయన ప్రసంగం సాగింది. తన ప్రసంగాన్ని ఆయన రాయప్రోలు సుబ్బారావు రాసిన దేశభక్తి గీతంతో ముగించారు.

 హైదరాబాద్ అంటే ఇదీ..

హైదరాబాద్ అంటే ఇదీ..

హైదరాబాద్ నగరం అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని రామ్‌నాథ్ కోవింద్ అనారు. హైదరాబాద్ రుచికరమైన ఆహారాన్ని, బ్యాడ్మింటన్ చాంపియన్లను, ఇండియన్ సాఫ్ట్ పవర్‌ను వ్యక్తీకరించే సినిమాలను అందించిందని ఆయన అన్నారు. తెలుగు వంటకాలకు ముఖ్యంగా పచ్చళ్లకు ఢిల్లీలో ఎంతో ఆదరణ ఉందని ఆయన చెప్పారు.

 హైదరాబాద్ లాగే తెలుగు భాష...

హైదరాబాద్ లాగే తెలుగు భాష...

హైదరాబాద్ నగరం మాదిరిగానే తెలుగు భాషష దేశంలోని పలు సంస్కృతులకు, ప్రాంతాలకు వారథిలా పనిచేస్తోందని కోవింద్ అన్నారు. గ్లోబల్ మెట్రోపోలిస్ మదిరిగా హైదరాబద్ పాన్ - ఇండియన్ సిటీ అని ఆయన అన్నారు. హైదరాబాదులోని టెక్నాలజీ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు దేశానికి ఎంతో అందిస్తున్నాయని చెప్పారు .హెల్త్ సెంటర్లు, సినిమా .. స్పెషల్ ఎఫెక్ట్ ప్రొడక్షన్ సెంటర్లు, క్రీడా సౌకర్యాలకు హైదరాబాద్ పేరు గాంచిందని చెప్పారు. అది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.

 సత్య నాదెళ్లను ప్రస్తావించిన రాష్ట్రపతి

సత్య నాదెళ్లను ప్రస్తావించిన రాష్ట్రపతి

ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎందరో తెలుగువారు పేరు ప్రఖ్యాతులు పొందారని చెబుతూ సత్య నాదెళ్ల, ఎల్లాప్రగడ సుబ్బారావు పేర్లను రామ్‌నాథ్ ఉదహరించారు. సోదర సోదరీమణులారా.. నమస్కారం అంటూ తెలుగులో పలుకరిస్తూ రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 నన్నయ ప్రస్తావన చేసిన కోవింద్..

నన్నయ ప్రస్తావన చేసిన కోవింద్..

వేయి సంవత్సరాల క్రితం నన్నయ్యభట్టు తెలుగు వ్యాకరణం రాయడమే కాకుండా మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని కోవింద్ చెప్పారు. ఆయన తర్వాత తిక్కన వచ్చాడని అన్నారు. 19వ శతాబ్దంలో గురజాడ అప్పారావు తన రచనలు, నాటకాల ద్వారా జాతి నిర్మాణానికి స్ఫూర్తినిచ్చారని, కవి శ్రీశ్రీ తన కవితలలో సామాన్యుల గళం వినిపించారని, నవల, కవితల ద్వారా వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటి వారు తెలుగు భాష వెలుగును దశ దిశలా వ్యాపింపచేయడానికి కృషిచేశారని. వట్టికోటతో విభేదించేవారు సైతం ఆయనను గౌరవించేవారని అన్నారు. దాశరథి గీతాలు ఇప్పటికీ అంతా పాడుకుంటుంటారని చెప్పారు.

 అన్నమాచార్య కీర్తనలపై ఇలా..

అన్నమాచార్య కీర్తనలపై ఇలా..

పాండిత్యానికి, విజ్ఞానానికి, నిరసనలకు స్వేచ్ఛకు, జాతి గొప్పదనానికి, సార్వజనీన విలువలకు భాషగా తెలుగు ఉన్నదని కోవింద్ అన్నారు.. ఈ రోజుకు కూడా త్యాగరాజ కృతులు కర్ణాటక సంగీతానికి కేంద్రంగా ఉన్నాయని, అన్నమాచార్య భక్తి గీతాలు సంప్రదాయానికి, విశ్వాసానికి పునాదిగా నిలిచాయిని చెప్పారు. అడవిపై, ప్రకృతి వనరులపై హక్కులపట్ల గిరిజనుల్లో స్పృహ కల్పించిన కుమ్రం భీం, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సాహసనారి ఐలమ్మ ఇదే ప్రాంతానికి చెందినవారన్న సంగతిని విస్మరించలేమని అన్నారు.

భాగ్యరెడ్డి వర్మ ప్రస్తావన

భాగ్యరెడ్డి వర్మ ప్రస్తావన

వంద సంవత్సరాల క్రితం రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ అంటరానితనమనే అనాచారానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని కోవింద్ గుర్తు చేశారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారని, సమాజంలో రుగ్మతలను పారదోలడానికి పాటుపడటంతోపాటు హైదరాబాద్‌ను స్వతంత్ర భారతావనిలో కలుపడానికి స్వామి రామానందతీర్థ కృషిచేశారని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగువారైన అల్లూరి సీతారామరాజు విప్లవకారులుగా కీలక భూమిక నిర్వహించారని అన్నారు.

 విదేశాల్లో సాఫ్ట్‌వేర్ శక్తులు

విదేశాల్లో సాఫ్ట్‌వేర్ శక్తులు

తెలుగు భాష ఇప్పుడు విశ్వభాషగా గుర్తింపు సాధించిందని, ఖండాతరాలకు వ్యాపించిందని కోవింద్ అన్నారు. ఇది పరిశ్రమలు, సాంకేతికరంగ భాష అని అన్నారు. విదేశాల్లోని తెలుగువారు సాఫ్ట్‌వేర్‌శక్తులుగా ఉన్నారని, దేశానికి పేరు తెస్తున్నారని అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఆగ్నేయాసియా వరకు తెలుగువారు, తెలుగు మాట్లాడేవారు విజేతలుగా గుర్తింపు పొందారని, అమెరికాలో తెలుగువారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని అన్నారు.

 ఎల్లాప్రగడ సుబ్బారావు ఇలా..

ఎల్లాప్రగడ సుబ్బారావు ఇలా..

పారిశ్రామికవేత్తలుగా, డాక్టర్లుగా, సాంకేతిక నిపుణులుగా ప్రఖ్యాతి పొందుతున్నారని కోవింద్ అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలుగువాడు కావడం గర్వకారణమని అన్నారు. ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు 1920-30 దశాబ్దంలో హార్వర్డ్ వర్సిటీలో తన ప్రతిభ చాటారని అన్నారు. విశ్వవ్యాపంగా తెలుగువారు విస్తరించి ఉన్నా.. మాతృభాష పట్ల, తమ మాతృభూమి సంస్కృతి పట్ల వారి చిత్తశుద్ధి బలీయమైనదని అన్నారు.

 రాయప్రోలు గేయంతో ముగింపు

రాయప్రోలు గేయంతో ముగింపు

రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ తన ప్రసంగాన్ని ముగిస్తానని కోవింద్ చెప్పి ఆ గేయం చరణాలను వినించారు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

English summary
Hyderabad is the city of biryani, badminton and Baahubali, President Ramnath Kovind said at the LB Stadium for the closing of World Telugu Conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X