మోడల్‌గా మారుదామని వెళ్లింది: మొరానీ వలలో పడింది

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీపై పోలీసులు సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ సంఘటన ఏడాది క్రితం జరిగింది.

హైదరాబాద్: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీపై తెలంగాణలోని రాచకొండ పోలీసులు సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. బాధితురాలు తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ పరిశ్రమలో పనిచేయాలనే ఉద్దేశంతో ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.

ముంబైలో ఆమె కరీం మొరానీ కూతురినికి కలిసిందని, ఆమెతో స్నేహం పెరిగిన తర్వాత వారింటికి తరుచుగా వెళ్తూ వచ్చిందని అంటున్నారు. ఆ తర్వాత ఆమె మొరానీ వలలో పడిందని, అతను పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడదని చెబుతున్నారు.

Hyderabad cops collect evidence in Karim Morani case

వారిద్దరు కలిసి హైదరాబాద్ వచ్చారని, హైదరాబాదులోని హోటల్స్‌లో ఉంటూ వచ్చారని, హయత్ నగర్ సమీపంలోని ఓ ఫిల్మ్ సిటీలో ఆమెపై మొరానీ లైంగిక దాడికి పాల్పడ్డాడని అంటున్నారు. ఈ సంఘటన ఏడాది క్రితం జరిగింది. అయితే, మొరానీ ఆమెకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవని పోలీసులు అంటున్నారు.

బాధితురాలు 24 ఏళ్ల బిబిఎ గ్రాడ్యుయేట్. కరీం మొరానీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మొరానీ తనపై ముంబైలోనూ హైదరాబాదులోనూ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+