గణేష్ నిమజ్జనం: ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను దారి మళ్లింపు
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా జిల్లాల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ఎంజీబీఎస్ వచ్చే బస్సులను దారి మళ్లించడం జరిగింది.
కరీంనగర్ వైపు నుంచి వచ్చే బస్సులు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్ ఘట్ మీదుగా ఎంజీబీఎస్ వెళ్తాయి.
ఇక బెంగళూర్ వైపు నుంచి వచ్చే బస్సులు.. ఆరంఘర్ క్రాస్ రోడ్స్, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఐఎస్ సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘట్ మీదుగా నడుస్తాయి. ముంబై వైపు నుంచి వచ్చే బస్సులు గోద్రెజ్ వై జంక్షన్, నర్సాపూర్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా మీదుగా వెళ్తాయి.

గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మాత్రమే పైన పేర్కొన్న రూట్లో బస్సుల దారి మళ్లింపు ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా నడుస్తాయి. గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం జరిగింది.
గ్రేటర్ లో ఇవాళ 535 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ(TSRTC) ఏర్పాటు చేసింది. రద్దీ ప్రాంతాల్లో సంబంధిత డిపో మేనేజర్లు అందుబాటులో ఉండాలని, పోలీస్ అధికారులతో వారిని సమన్వయం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. కాగా, గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఇప్పటికే పోలీసులు కూడా పలు మార్గాల్లో ఆంక్షలు, దారి మళ్లింపులు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన సందడి
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకల సందడి కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ సహా సుమారు 100 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర గురువారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. ప్రస్తుతం సెక్రటేరియట్ వద్దకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు.
గణపతి బప్పా మోరయా అంటూ వేలాదిగా భక్తులు ఖైరతాబాద్ గణేశుడి వెంట శోభయాత్రలో కదులుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్ సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తి కానుంది. మరోవైపు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్‌కు తీసుకొస్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ మార్గంలో భారీగా భక్తుల సందడి నెలకొంది. 40 వేల పోలీసు బలగాలతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. బడా గణేశ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, టెలిఫోన్ భవన్ వైపు నుంచి వచ్చేవారికి.. పోలీసులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోనే భక్తులను అనుమతించానారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. భక్తుల రాకతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications