నెట్లో రీసెర్చ్ చేసి డ్రగ్స్ తయారీ, అరెస్ట్: సినీ స్టార్స్‌కు డ్రగ్స్ ఎలా అందిందంటే..?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ డిసి వివేకానంద రెడ్డి శుక్రవారం తెలిపారు. హైదరాబాదులో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న పీయూష్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ముడిసరుకును తెప్పించుకొనే వాడని చెప్పారు.

కుదిపేస్తున్న డ్రగ్స్: ముమైత్ ఖాన్ స్పందన

డ్రగ్స్‌పై ఇంటర్నెట్‌లో రీసెర్చ్

డ్రగ్స్‌పై ఇంటర్నెట్‌లో రీసెర్చ్

పీయూష్ ఇంజినీరింగ్ చేసే సమయంలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని తెలిపారు. ఇతను మల్కాజిగిరికి చెందిన వ్యక్తి అన్నారు. ఇంటర్నెట్ ద్వారా ఎల్ఎస్‌డిని కొనుగోలు చేసేవాడన్నారు. డ్రగ్స్ పైన ఇంటర్నెట్ రీసెర్చ్ చేశాడని తెలిపారు.

విదేశాల నుంచి..

విదేశాల నుంచి..

అనంతరం సొంతంగా డ్రగ్స్ తయారు చేయడం మొదలు పెట్టాడన్నారు. అతని నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విదేశాల నుంచి పీయూష్ ఎల్ఎస్డీలు తెప్పించినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు.

విదేశాల నుంచి తెప్పించిన సరుకుకు సమానంగా మత్తు వచ్చేలా

విదేశాల నుంచి తెప్పించిన సరుకుకు సమానంగా మత్తు వచ్చేలా

అతని నుంచి 400 గ్రాముల కొకైన్, 80 ఎల్ఎస్డీలు, 20 గ్రాముల గంజాయి,150 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వయాగ్ర, యాంటీ డిప్రెషన్ మందులు, కెఫెన్, నిద్రమాత్రలు కలిపి లోకల్ మేడ్ ఎల్ఎస్సీడీ ప్యాకెట్లను తయారు చేసేవాడన్నారు. విదేశాల నుంచి తెప్పించిన సరుకుకు సమానంగా మత్తు వచ్చేలా వీటిని తయారు చేసేవాడని తెలిపారు.

ఇలా సరఫరా అంటూ..

ఇలా సరఫరా అంటూ..

కాగా, రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస రావు జీశాన్ నుంచి డ్రగ్స్ తీసుకునే వారని ప్రచారం సాగుతోంది. జగన్నాథ్‌కు కెల్విన్ సరఫరా చేసేవాడని చెబుతున్నారు. జగన్నాథ్ ద్వారా చార్మీ, సుబ్బరాజులకు అలవాటు అయినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. కానీ ఈ వార్తలను సుబ్బరాజు, ముమైత్ ఖాన్ తదితరులు కొట్టిపారేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Hyderabad excise department on Friday arrested one youth in the drug racket busted five days back and seized LSD.
Please Wait while comments are loading...