హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్‌లో తయారై నగరానికి భారీగా ఫేక్ కరెన్సీ: అరెస్ట్, 9లక్షలు సీజ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారీ ఎత్తున నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా తయారు చేసిన భారతీయ నకిలీ కరెన్సీని ముగ్గురు వ్యక్తులు చలామణి చేస్తున్నట్లుగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.

ముగ్గురు నిందితుల వద్ద నుంచి రూ. 9 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డికి చెందిన తౌఫిక్ అనే వ్యక్తి నకిలీ నోట్ల వ్యవహరం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు

నిందితులు

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాల గుట్టు రట్టయింది. కుషాయిగూడ, జవహర్‌ నగర్‌లో దాడులు చేసిన ఎస్‌వోటీ పోలీసులు ఏడుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 59వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసు కున్నారు.

ఇవే నకిలీ నోట్లు

ఇవే నకిలీ నోట్లు

మల్కాజిగిరి డీసీపీ రమేష్‌ నాయుడు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నాగవల్లి, అబ్దుల్‌ దాలీం చిన్ననాటి స్నేహితులు. జార్ఖండ్‌లోని ఒకే గ్రామానికి చెందిన వీరు స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. వ్యాపారం నిర్వహిస్తుండగా నాగవల్లికి గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. నకిలీ నోట్లు చలామణి చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పగా.. అతడు రూ. 25 వేలు ఇచ్చి 50 వేల నకిలీ నోట్లు తీసుకున్నాడు. నకిలీ నోట్ల చలామణి ద్వారా ఆదాయం ఎక్కువగా రావడంతో ఆ వ్యాపారాన్నే కొనసాగించాలను కున్నాడు.

మీడియా ముందుకు..

మీడియా ముందుకు..

ఒకేచోట నకిలీ నోట్లను చలామణి చేస్తే పోలీసులకు దొరుకుతామని భావించిన నాగవల్లి.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చలామణి చేయాలని పథకం వేశాడు. స్నేహి తులు దాలీం, జహంగీర్‌తో కలిసి ఘట్‌కేసర్‌లో ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్న మామ వద్దకు వచ్చాడు. రెండు లక్షల నకిలీ నోట్లు తీసుకొచ్చి చలామణి చేశారు. జార్ఖండ్‌కు వెళ్లిపోయి రెండు లక్షల నోట్లు తీసుకొని నగరానికి మరలా వచ్చాడు. వాటిని చలామణి చేసే సమయంలో దాలీంకు కుషాయిగూడకు చెందిన విశాల్‌, నల్లగొండ బీబీనగర్‌కు చెందిన జైల్‌సింగ్‌, హరికృష్ణ పరిచయమయ్యారు. వీరందరూ చక్రిపురంలో ఓ ఇంట్లో ఉంటూ ఈ వ్యాపారం చేసేవారు. దాలీంపై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరాన్ని అంగీకరించడంతో అతడితో పాటు జహంగీర్‌, విశాల్‌, జైల్‌సింగ్‌, హరికృష్ణను అరెస్టు చేశారు.

అప్రమత్తంగా ఉండాలి..

అప్రమత్తంగా ఉండాలి..

ప్రధాన నిందితుడు నాగవల్లి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి రూ. 54వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ఇష్రఫ్‌-ఉల్‌-షేక్‌, జైన్‌-ఉల్‌- షేక్‌ను అరెస్టు చేశారు. ఈ ముఠాలో సేనా-ఉల్‌-షేక్‌, రఫీక్‌ పరారీలో ఉన్నారు. వీరి నుంచి ఐదు వందల నకిలీ నోట్లు 10, రూ. 34,300, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసు కున్నారు. ఈ రెండు ముఠాలు రద్దీగా ఉండే మార్కెట్లలో చిరు వ్యాపారుల వద్ద నోట్లను మార్చేవారని డీసీపీ చెప్పారు. నాగవల్లి చలామణి చేసిన నోట్లలో 15శాతం స్నేహితు లకు ఇచ్చేవాడన్నారు. ఈ నోట్లను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో దర్యాప్తు చేస్తున్నా మని చెప్పారు. నకిలీ నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

English summary
A five-member gang smuggled counterfeit notes from Jharkhand and exchanged such notes worth thousands by buying groceries, vegetables etc from traders on the city’s outskirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X