కరాచీ బేకరీలో భారీ పేలుడు: 15 మందికి తీవ్రగాయాలు, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీ కిచెన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కడే పనిచేస్తున్న 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను తొలుత శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆగురురిని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు రాజేంద్రనగర్‌లోని పారిశ్రామికవాడలో బేకరీ నడిపిస్తున్నారు. దాదాపు 100 మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. రోజూలానే గురువారం ఉదయం ఆహార పదార్థాలను తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ పైప్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది.

మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రానికి చెందినవారున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
VIDEO | A cylinder blast at Karachi Bakery in Hyderabad's Gaganpahad left 15 workers injured earlier today. More details are awaited. pic.twitter.com/ZIoXMFd3tk
— Press Trust of India (@PTI_News) December 14, 2023
కామారెడ్డిలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు మాల్ మొత్తం వ్యాపించాయి. దీంతో మాల్‌లోని సామాగ్రి కాలి బూడదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి.
గురువారం ఉదయం 7 గంటల వరకు మంటలను ఆర్పివేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఆ మాల్ పక్కనే ఉండే నివాసాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ.. రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications