హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Model Corridors: హైదరాబాదు వాసులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కొత్త ప్లాన్‌తో GHMC

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం...ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఈ నగరాన్ని మాత్రం ఓ సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. అదే ట్రాఫిక్ సమస్య. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలున్నాయి.కానీ వాటికి పరిష్కారం కూడా త్వరగా దొరుకుతుంది. హైదరాబాదులో కూడా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలు చేయని ప్రయత్నమంటూ లేదు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కొత్తగా నగరంలో పలు రద్దీ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించారు. అయినా సరే ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. మెట్రోలు వచ్చాయి. అయినప్పటికీ కూడా రద్దీ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

సిటీలో మోడల్ కారిడార్లు

సిటీలో మోడల్ కారిడార్లు

ఇప్పటికే ప్రధానంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో చాలా చోట్ల నూతనంగా ఫ్లైఓవర్లు నిర్మించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ తాజాగా మరో కొత్త మోడల్‌కు శ్రీకారం చుట్టనుంది.సిటీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఈ మోడల్ కచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ పశ్చిమాన కొత్తగా మూడు మోడల్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది.ఇందుకోసం స్టాండింగ్ కమిటీ ఈ వారంలోనే ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. అంతకుముందు బండ్లగూడ మెయిన్‌రోడ్ మరియు ఆరాంఘర్‌లలో మోడల్ కారిడార్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.

మోడల్ కారిడార్లు ఎక్కడెక్కడంటే..?

మోడల్ కారిడార్లు ఎక్కడెక్కడంటే..?

ఇదిలా ఉంటే కొత్తగా నిర్మించనున్న మూడు మోడల్ కారిడార్లు హైదరాబాదులోని నానక్‌రాం గూడ జంక్షన్ నుంచి ఐటీ హైట్స్ రోడ్, బయోడైవర్శిటీ నుంచి లెదర్ ఇన్స్‌టిట్యూట్‌, ఐటీ హైట్‌ రోడ్స్ నుంచి ఖాజాగుడా జంక్షన్ వరకు మోడల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.16.7 కోట్లు వెచ్చిస్తోంది జీహెచ్‌ఎంసీ. ఈ మూడు కారిడార్లతో పాటు వీటి పక్కనే ఆరు మీటర్ల సర్వీస్ రోడ్, 1.8 మీటర్ల మేరా సైకిల్ ట్రాక్‌ను కూడా జీహెచ్‌ఎంసీ డెవలప్ చేయనుంది.ఇక ఫుట్‌పాత్ పై మొక్కలు కూడా నాటుతారు.

హైదరాబాద్‌లో కొత్తగా మరో రెండు ఫ్లైఓవర్లు

హైదరాబాద్‌లో కొత్తగా మరో రెండు ఫ్లైఓవర్లు

మరోవైపు హైదరాబాద్‌లో ఇంకో రెండు ఫ్లైఓవర్ రానున్నాయి.ఒకటి శిల్పా లేఔట్ వద్ద మరొకటి కొత్తగూడ వద్ద రానున్నట్లు సమాచారం.వీటికి వచ్చే వారంలో శంకుస్థాపన జరుగుతుందని తెలుస్తోంది. శిల్పా లేఔట్ వద్ద ఏర్పాటు కానున్న ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌ ఔటర్ రింగ్‌రోడ్‌కు వెళ్లే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుంది.కొత్త గూడ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ మధ్య ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుంది.కొద్ది రోజుల క్రితమే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. దీంతో ఎల్‌బీ నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు ట్రాఫిక్ సమస్య తగ్గింది.

ఉప్పల్‌లో స్కైవాక్‌లు

ఉప్పల్‌లో స్కైవాక్‌లు

కొత్త ఫ్లై ఓవర్లు, కారిడార్లతో సహా స్కై వాక్‌లు సైతం ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌ జంక్షన్‌లో స్కైవాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ స్కైవాక్‌లు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉన్నాయి. స్కైవాక్‌లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి చేయనుంది. స్కైవాక్‌లు ఏర్పాటు అయితే పాదచారులు రోడ్లు దాటేందుకు సులభతరం అవుతుంది. స్కైవాక్‌లు ఏర్పాటు అయిన చోట మెట్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉంటాయి.

English summary
GHMC planning to come up with model corridors to ease traffic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X