చాందినికి స్నేహితులెక్కువ, మరో ఇద్దరితోను, ప్రియుడి నిలదీత, ప్లాన్‌తో హత్య, అక్కడే దొరికాడు: సిపి

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chandini Jain case : Sai Kiran Reddy Reveals Shocking Facts, CCTV footage | Oneindia Telugu

  హైదరాబాద్: మియాపూర్‌కు చెందిన చాందిని జైన్‌ను నిందితుడు పక్కా ప్రణాళికతో హత్య చేశాడని సిపి సందీప్ శాండిల్య బుధవారం వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

  చాందిని నన్ను వదల్లేదు, చంపేశా: నిందితుడు, 'ప్లే బాయ్ కావొచ్చు, అమ్మాయిల్ని మార్చేవాడేమో'

  ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. నిందితుడు చెప్పినట్లుగా ఆవేశంలో హత్య చేయలేదని, ప్లాన్ ప్రకారమే హత్య చేశాడన్నారు. రెండు నెలల క్రితమే ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చాడని చెప్పారు. ఈ సందర్భంగా కొత్త విషయం వెలుగు చూసింది.

  చాందినికి నాగా, సాహిల్‌ అనే వ్యక్తులతోను స్నేహం ఏర్పడిందని, దీనిపై అతను నిలదీశాడని, ఈ గొడవలో ఇరువురు కొట్టుకునే వరకు వెళ్లిందని సిపి తెలిపారు. 9వ తేదీన సాహిల్‌తో పబ్బుకు వెళ్లాల్సి ఉండెనని, దీనిపై ఇరువురి మధ్య గొడవ జరిగిందన్నారు. హత్య జరిగిన రోజు ఇరువురు గొడవ పడ్డారని, నిందితుడిని మృతురాలు చెంపపై కొట్టి, ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పిందని, అతను ఆమెపై దాడి చేశాడని, ఆ తర్వాత పారిపోయాడని చెప్పారు..

  ప్రేమికులని తెలియదు: చాందిని తండ్రి కంటతడి, నా చెల్లి గురించి తెలుసు: సోదరి

  చాందినికి చాలామంది స్నేహితులు, నిలదీత

  చాందినికి చాలామంది స్నేహితులు, నిలదీత

  చాందిని జైన్‌కు చాలామంది స్నేహితులు ఉన్నారని, ఈ విషయం తెలిసి నిందితుడు ఆమెను నిలదీశాడని చెప్పారు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. చాందినికి చాలామంది స్నేహితులు ఉన్నారని తెలిసి అతను నిలదీశారని, దీంతో వ్యూహం ప్రకారం చంపేశాడని కొత్త విషయం వెలుగు చూసింది.

  ఫిర్యాదు అందగానే ఇలా

  ఫిర్యాదు అందగానే ఇలా

  శనివారం నాడు చాందిని అదృశ్యమైనట్లుగా తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. దీంతో వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాల్ డేటా వివరాలు, స్నేహితుల వివరాలు సేకరించి, వారిని కూడా విచారించామని చెప్పారు. అలాగే సిసి కెమెరాలలోని దృశ్యాలను సేకరించినట్లు చెప్పారు.

  స్నేహితులందర్నీ పిలిచి విచారించాం

  స్నేహితులందర్నీ పిలిచి విచారించాం

  అమ్మాయికి చాలామంది స్నేహితులు ఉన్నారని, దీంతో వారిని పిలిపించి అడిగామని చెప్పారు. ఆ సమయంలో వారు ఎక్కడ ఉన్నారో ప్రశ్నించామని తెలిపారు. నిందితుడిని కూడా ప్రశ్నించామన్నారు.

  తొలుత అబద్దం చెప్పిన నిందితుడు

  తొలుత అబద్దం చెప్పిన నిందితుడు

  నిందితుడు నిందితుడు తొలుత అబద్దం చెప్పాడని సిపి తెలిపారు. ఆ సమయంలో తాను క్రికెట్ ఆడుతున్నట్లు అబద్దం ఆడాడని చెప్పారు. కానీ పలు ఆధారాలతో అతనిని విచారించడంతో నిజాలు వెలుగు చూశాయని చెప్పారు. తొలుత అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడన్నారు.

  రెండు నెలల క్రితం అదే స్పాట్ వద్ద

  రెండు నెలల క్రితం అదే స్పాట్ వద్ద

  రెండు నెలల క్రితం హత్య జరిగిన స్పాట్ వద్దకే నిందితుడు వచ్చాడని చెప్పారు. చాందినికి ఉన్న స్నేహితుల గురించి ఇరువురు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. నిందితుడు, చాందిని ఇద్దరు ఆటోలో హత్య జరిగిన రోజు ఆ ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. హత్య జరిగిన రోజు గురించి అతను అబద్దాలు చెప్పినట్లు విచారణలో తేలిందన్నారు.

  కోపంతో మెడకు చున్నీ బిగించి, నిందితుడి తండ్రి గుర్తించాడు

  కోపంతో మెడకు చున్నీ బిగించి, నిందితుడి తండ్రి గుర్తించాడు

  ఆ రోజు కూడా ఇరువురి మధ్య గొడవ జరిగిందని సిపి చెప్పారు. నిందితుడు ఆగ్రహంతో ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడని చెప్పారు. సిసి కెమెరాల్లో ఉన్నది తన కొడుకు అని నిందితుడి తండ్రి కూడా గుర్తించాడని చెప్పారు.

  సోషల్ మీడియా ప్రభావంతో అపరిచితులతో పరిచయం

  సోషల్ మీడియా ప్రభావంతో అపరిచితులతో పరిచయం

  సోషల్ మీడియా ప్రభావంతో చాందిని అపరిచితులతో పరిచయం చేసుకుందని సిపి తెలిపారు. పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాందినిని ఒక్కడే హత్య చేశాడని, వేరే వారి సాయం కూడా తీసుకున్నాడని వస్తోన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు.

  అక్కడే దొరికాడు

  అక్కడే దొరికాడు

  నిందితుడికి క్రికెట్ ఆడే అలవాటే లేదని తెలిసిందని, కానీ అతను క్రికెట్ ఆడుతున్నానని చెప్పడంతో దొరికిపోయాడని చెప్పారు. చాందిని, అతని మధ్య చాలా రోజుల క్రితం గొడవ జరిగిందన్నారు. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే క్లాస్‌లో చదివి, కాలేజీకి వేర్వేరు కళాశాలల్లో చేరారని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Hyderabad police on Wednesday arrested a childhood friend of Chandini Jain in connection with her murder. The 17 year old’s decomposed body was found on Tuesday morning in the outskirts of the city, after she went missing on Saturday evening.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి