Hyderabad: రేపు హనుమాన్ శోభయాత్ర, ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో శనివారం (ఏప్రిల్ 12న) హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ శోభయాత్ర గౌలిగూడలోని శ్రీరామ మందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. తాడ్ బండ్‌లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగిస్తుంది.
హనుమాన్ శోభయాత్ర మార్గం పరిశీలించినట్లయితే.. పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్ కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రో్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‍పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాల్ పేట రోడ్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా సాగుతూ తాడ్‌బండ్‌లోని హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది.

హనుమాన్ శోభయాత్ర నేపథ్యంలో పోలీసులు శనివారం ఉదయం నుంచి రాత్రి గంటల వరకు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల గుండా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. లక్డీకపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లైఓవర్, ప్యారడైజ్ ఫ్లైఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకోవాలని సూచించారు.
ఈ శోభయాత్ర భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హనుమాన్ శోభయాత్ర మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications