జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఉద్యోగం చేసేందుకు హైదరాబాదే ఉత్తమ నగరమని యువత చెబుతోంది. గతంలో ప్రాంతంతో పనేముంది, ఉద్యోగం వస్తే చాలు అనుకునే యువత... తాజా పరిస్థితుల్లో ఆ వైఖరికి స్వస్తి చెప్పింది. ఉద్యోగం చేసేందుకు ప్రదేశం కూడా ఎంతో ముఖ్యమని ప్రస్తుతం యువత భావిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది.

అంతేకాదు ఉద్యోగం చేసేందుకు యువత ప్రాధాన్యమిచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే... పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ్రస్టీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లింక్‌డ్‌ఇన్ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వేని నిర్వహించాయి.

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

ఈ సర్వే వివరాలను ఇండియా స్కిల్స్ రిపోర్టు-2016 వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా వీబాక్స్ ఎంప్లాయిబలిటీ స్కిల్ టెస్ట్(వెస్ట్) పేరుతో దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.2 లక్షలమంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఓ నివేదికను రూపొందించారు.

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

2014 నుంచి 2016 వరకు ఈ సర్వేను నిర్వహించారు. వీబాక్స్ ఎంప్లాయిబలిటీ స్కిల్ టెస్ట్(వెస్ట్) ప్రకారం బీటెక్, ఫార్మా వంటి కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగం కోసం రాజధాని ఢిల్లీ అనువుగా ఉందంటూ దానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు.

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

ఆ తర్వాత ఢిల్లీ చుట్టూ రాజధాని ప్రాంతంగా ఎంచుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, లక్నో నిలిచాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 10వ స్థానం లభించింది.

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

జై కొట్టారు: ఉద్యోగానికి అనువైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్

ఈ సర్వేలో అత్యధిక మహిళా ఉద్యోగులు హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. కాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యోగార్ధులు 22 నుంచి 25 ఏళ్లలోపే ఉద్యోగాలు పొందుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Is the best city to get best job opportunities.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి