హైదరాబాద్ కు అమృత్ భారత్ రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు..!!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు, కేరళపై కేంద్ర ప్రభుత్వం వరాలను కురిపించింది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు మూడు చొప్పున అమృత్ భారత్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. తమిళనాడుకు కేటాయించినవి ఏపీ మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు రాకపోకలు సాగిప్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయం దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల మధ్య దూర రైలు అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ తెలిపింది.
వీటికి అదనంగా ఈ రెండు రాష్ట్రాలకు ఒక్కో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కూడా ఏపీ మీదుగా తెలంగాణకు కనెక్ట్ అయ్యేలా రూట్ ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఒకటి- చర్లపల్లి నుండి నాగర్‌కోయిల్, రెండోది- తిరువనంతపురం నుండి హైదరాబాద్ మధ్య ఇవి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ కు అమృత్ భారత్ రైళ్లు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చర్లపల్లి నుండి నాగర్‌కోయిల్ ఎక్స్ ప్రెస్.. గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుచిరాపల్లి, మదురై వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. రెండోది తిరువనంతపురం- హైదరాబాద్ మార్గంలో సేవలు అందిస్తుంది. విజయవాడ, ఒంగోలు, తిరుపతి, సేలం, కోయంబత్తూర్, త్రిశూర్ ఉన్నాయి. వీటితో పాటు తిరువనంతపురం-చెన్నై, తిరువనంతపురం-బెంగళూరు మధ్య కూడా మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
తిరువనంతపురం- హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న రైలు ప్రయాణం దాదాపుగా 22 గంటలు పడుతోంది. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెడితే ప్రయాణ సమయంలో మూడు నుంచి నాలుగు గంటలు తగ్గే అవకాశం ఉంది. తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ ఎక్స్ ప్రెస్ త్రిశూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, బెంగళూరు, అనంతపురం, కర్నూలు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించేలా రూట్ ఖరారైనట్లు సమాచారం.
తమిళనాడు- పశ్చిమబెంగాల్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు శనివారం నాడు పట్టాలెక్కనున్నాయి. తిరుచిరాపల్లి- న్యూ జల్ పాయ్ గురి, తాంబరం- సంత్రాగచ్చి, నాగర్‌కోయిల్- న్యూ జల్ పాయ్ గురిని కనెక్ట్ చేస్తాయి ఈ రైళ్లు ఇవన్నీ కూడా ఏపీ మీదుగా రాకపోకలు సాగించేవే. తిరునల్వేలి, కోవిల్‌పట్టి, సత్తూరు, విరుధునగర్, మధురై, దిండిగల్, పళని, ఉడుమాల్ పేట, పొల్లాచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ మీదుగా నడుస్తాయి.












Click it and Unblock the Notifications