Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్‌షాప్‌లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత పక్కనవున్న భవనాలకు వ్యాపించడతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అగ్రి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్‌లోఅగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు, గోల్కొండలోని ఫోర్డ్ కార్ల షోరూంలోనూ గురువారం రాత్రి అగ్నిచోటు చేసుకుంది. దీంతో మూడు కార్లు దగ్ఘమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.
VIDEO | Hyderabad: A massive fire breaks out in a scrap truck warehouse in Bahadurpura. Further details awaited.
— Press Trust of India (@PTI_News) March 6, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/MznjpRZ0ea
ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఎగ్జిట్ 13 వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మొక్కలకు నీరు పోస్తున్న నీళ్ల ట్యాంకర్‌ను వేగంగా వస్తున్న బ్రీజా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంకర్ వ్యక్తి, కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందినవారిలో ఒకరు నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నోనిబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన బత్తిని కృష్ణారెడ్డి కాగా, మరొకరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలన్ గ్రామానికి చెందిన చెనమోని రాములు(చెట్లకు నీళ్లు పడుతున్న వ్యక్తి)గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications