Hyderabad updates:ఉలిక్కి పడ్డ భాగ్య నగరం-జర భద్రం,వీడియో వైరల్..!

హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి విశ్వనగరంగా గుర్తింపు ఉంది. ఇటు ఐటీ సెక్టార్ అటు ఫార్మా రంగాల్లో ప్రపంచస్థాయి నగరాలతో మన హైదరాబాద్ పోటీ పడుతోంది. మనిషి సంతోషంగా జీవించేందుకు సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి అని చెప్పొచ్చు. ప్రభుత్వ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అలాంటి హైదరాబాద్ నగరం ప్రస్తుతం వేరే కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు హత్యలు జరుగుతుండటంతో ఇక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థలు ఏమయ్యాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పట్టపగలే దోపిడీలు,హత్యలు

హైదరాబాద్ నగరం ఒక్కసారిగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. అర్థరాత్రి దాడులు, హత్యలు, దోపిడీలు జరుగుతుండటమే ఇందుకు కారణం.తాజాగా ఓ వ్యక్తి హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జూన్ 13వ తేదీ రాత్రి జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్‌లో నిత్యం రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఓ 27 ఏళ్ల వ్యక్తిపై కొందరు కత్తులతో కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Hyderabad makes headlines for all the wrong reasons safety in concern

వెంటపడి పొడిచి హత్య చేశారు

పాత కక్షలే ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని వెంబడించి కత్తులతో కొందరు పొడిచారు. కడుపులో, మెడపై, గుండెపై వరుసగా పొడవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. అందరూ చూస్తుండగానే దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చేతిలో కత్తులు ఉండటంతో అక్కడి స్థానికులు భయపడిపోయారు. ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కొందరు ఈ ఘటనను తమ సెల్‌ఫోన్లలోని కెమెరాలతో రికార్డు చేశారు. హత్యకు గురైన వ్యక్తిని సమీర్‌గా పోలీసులు గుర్తించారు. తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా కాపుకాసిన కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారు.

దాడి జరిగిన తర్వాత బాధితుడు సమీర్ పరుగులు తీసి సమీపంలోని తన సోదరుడి దుకాణం ముందు రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు.అయితే పాత కక్షలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. హతుడి సోదరుడు ఇచ్చిన వివరాల మేరకు నిందితులు సయ్యద్ ఇమ్రాన్, తాహెర్,అమన్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

కొత్తపేటలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

ఇదిలా ఉంటే మరో ఘటనలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో అర్థరాత్రివేళ కొందరు యువకులు గంజాయి సేవిస్తుండగా వారిని ఓ ఇంటి యజమాని నిలదీశారు.అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ మందలించాడు. దీంతో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ ఇంటి యజమాని జనార్ధన్ పై కర్రలు రాళ్లతో దాడి చేశారు. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని జనార్థన్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను గుర్తించే పనిలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+