లండన్‌: హైదరాబాద్ యువకుడి అనుమానాస్పద మృతి

లండన్/హైదరాబాద్: లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని మీరాలం మండీకి చెందిన హసల్ అలీ కుమారుడు మీర్ బాఖీర్ అలీ రిజ్వీ ఏప్రిల్ 12న లండన్‌లోని రైలు పట్టాలపై శవమై కనిపించాడు.

రిజ్వీ మృతిపై అతని కుటుంబసభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2009లో లండన్ వెళ్లిన రిజ్వీ అక్కడే ఎంబీఏ చేస్తున్నాడు. కాగా, నిరుడు కొందరు దుండగులు దాడి చేయడంతో రిజ్వీ గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి మళ్లీ లండన్ వెళ్లాడు.

Hyderabad man found dead in London, kin asks govt to bring back body

అక్కడికి వెళ్లిన తర్వాత తనపై దాడి చేసిన వ్యక్తులపై కేసు పెట్టినట్లు సమాచారం.
అప్పుడు దాడి చేసిన వ్యక్తులే రిజ్వీని హత్య చేసివుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిజ్వీ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం సహాయం చేయాలని అతని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఇటీవల సోదరుడి వివాహ రిసెప్షన్ సందర్భంగా రిజ్వీ అతనికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడని రిజ్వీ బావ తెలిపారు. ఆ తర్వాతి రోజే రిజ్వీ చనిపోయాడని పోలీసులు చెప్పారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+