మావోయిస్టుల్లో స్వార్థం పెరిగిపోయింది, నాటి విలువల్లేవు: పురుషోత్తమ్ లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నాయకత్వంలో స్వార్థం పెరిగిపోయిందని, మానవ సంబంధాలు పార్టీకి దూరమయ్యాయని పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పురుషోత్తమ్ అన్నారు. మంగళవారం తన భార్య, మహిళా మావోయిస్టు వినోదినితో కలిసి ఆయన హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా పురుషోత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ వైపు మావోయిస్టు అగ్ర నాయకత్వం నిర్లక్ష్యం చేయడం.. మరోవైపు ఆరోగ్యం సహకరించకే లొంగిపోయినట్లు పురుషోత్తమ్ తెలిపారు. తాను 1969, 1972లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నానని.. రామకృష్ణ, గణపతితో 25ఏళ్లుగా కలిసే తిరిగినట్లు పురుషోత్తమ్ తెలిపారు.

మావోయిస్టు అగ్రనాయకత్వంలో 20ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేదని.. ఇప్పుడు వారిలో స్వార్థం పెరిగిపోయిందన్నారు. పదేళ్లుగా తమను నిర్లక్ష్యం చేశారని.. అగ్ర నాయకత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు.
తమను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. వినోదిని ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టించుకోలేదని.. కనీసం ఆమె చేతివంట తిన్న విశ్వాసం కూడా వారికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ప్రతినిధులను హత్య చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిపాలన బాగుందని అన్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications