హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన రాష్ట్రానికి ఎట్టకేలకు ఉపశమనం లభించనుంది. రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉనైరుతి రుతుపవనాలు కేరళ భూభాగంలోకి రాగల 4-5 రోజుల్లో ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అరేబియా సముద్రంలో, కర్ణాటక తీరానికి సమీపంలో మే 21 నాటికి ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మే 22 నాటికి అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడి, క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నిన్న రాయలసీమ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది.రాగల 3 రోజులకు వాతావరణ సూచన ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వాతావరణం చల్లగా మారనుంది.

వాతావరణ హెచ్చరికలు
రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో బయట ఉండకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications