ప్రయాణీకులకు గుడ్ న్యూస్ - మెట్రో రైలు సమయం పొడిగింపు..!!

గణేశ్ నిమజ్జనం కోసం భాగ్యనగరం ముస్తాబు అయింది. వేలా సంఖ్యలో గణనాధులు సాగరతీరాని కి నిమజ్జనం కోసం తరలి రానున్నాయి. జీహెచ్ఎంసీ.. పోలీసు శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ప్రవేశాలను నియంత్రించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల కోసం మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అర్ద్రరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇక.. నగర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.

నగరంలో వినాయక నిమజ్జనం వేళ పండగ వాతావరణం నెలకొంది. వినాయకులను అంగరంగ వైభవంగా అలంకరించి గణేష్ శోభ యాత్రలు నిర్వహిస్తున్నారు. గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. అన్ని మార్గాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు అందుబాటు లో ఉంటాయి.ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్లలో పోలీసులతో అదనపు భద్రత ఏర్పాటు చేసారు. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లను సిద్దం చేస్తున్నారు. గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

hyderabad-metro-extends-its-operational-hours-for-ganesh-immersion

రేపు ఉదయం 8 నుంచి 7వ తేదీ ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు చోట్ల ట్రాఫిక్ దారి మళ్లింపు ప్రకటించారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రేపు(శనివారం) ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలు వెళ్లిన వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

వినాయకులు వెళ్ళడానికి నగరంలో మ్యాప్ వేసుకొని రూట్స్ డిసైడ్ చేశామని చెప్పారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు అనుసరించాలని పేర్కొన్నారు. రోడ్లపై డైవర్షన్ ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశామని, వాటి అనుగుణంగా వినాయకులను తీసుకెళ్లాలని సూచించారు. నిమజ్జనం సమయంలో.. 29 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. రేపు(శనివారం) మధ్యాహ్నం 1 గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామని వెల్లడించారు. మండప నిర్వాహకులు తొందరగా బయలుదేరి రావాలని సూచించారు. రేపు సుమారు 50వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని అంచనా వేసినట్లు సీపీ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+