ఐపీఎల్ అభిమానులకు మెట్రో రైల్ గుడ్‌న్యూస్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి కూడా సేవలు

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (బుధవారం) ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీతోపాటు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఉప్పల్ మార్గంలో బుధవారం చివరి రైలు అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని వెల్లడించారు. అయితే, ఆ సమయంలో నాగోల్, ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తారని, మిగతా స్టేషన్లు యథావిథిగా మూసి ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

hyderabad metro rail timings extended during ipl match SRH Vs MI in Uppal stadium

టీఎస్​ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఐపీఎల్ మ్యాచ్​ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) కూడా శుభవార్త చెప్పింది. బుధవారం జరిగే ముంబై ఇండియన్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌కు ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అభిమానులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మైదానానికి 60 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డపనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

ఈ బస్సులు బుధవారం సాయంత్రం 6 గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై, మ్యాచ్‌ అనంతరం తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని, మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్‌ అభిమానులకు ఆయన సూచించారు.

hyderabad metro rail timings extended during ipl match SRH Vs MI in Uppal stadium

ఉప్పల్ మ్యాచ్‌కు భారీ భద్రత

బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫేవరేట్ జట్లు తలపడనున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు తరలివస్తున్నారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 2500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

ఉప్పల్ స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీటింగ్ సామర్థ్యం 39 వేలు ఉందని, స్టేడియం లోపల కూడా భారీగా పోలీసులను మోహరిస్తామని చెప్పారు. అయితే, ప్రేక్షకులకు పలు సూచనలు చేశారు సీపీ తరుణ్ జోషి. ల్యాప్‌ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌పై నిషేధం ఉందని, స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సీపీ స్పష్టం చేశారు.

అయితే, బ్లూటూత్స్ అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ నిఘా ఉందని తెలిపారు. బుధవారం నాటి మ్యాచ్‌కు మధ్యాహ్నం 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని సీపీ తెలిపారు. నాలుగు అంబులెన్స్‌లు, మెడికల్ టీమ్స్, ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచామన్నారు. టికెట్ కొనుగోలు చేసినవారి కోసం పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ జోషి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+