SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అయితే, మిగతా మార్గాలలో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని తెలిపారు.
ఉప్పల్ మార్గంలో ఏప్రిల్ 25న పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు. ఉప్పల్ మార్గంలో చివరి మెట్రో రైలు అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందన్నారు. అయితే, ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని మెట్రో ఎండీ స్పష్టం చేశారు. అలాగే, మిగతా మార్గాలలో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలల్లో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయన్నారు. అంటే, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని చెప్పారు.
క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. క్రికెట్ అభిమానులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉప్పల్ స్టేడియం వరకు 60 బస్సులను అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్
కాగా, ఏప్రిల్ 25న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు ఏప్రిల్ 15న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి ఆడాయి. అదే మ్యాచ్‌లో.. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287 చేసిన విషయం తెలిసిందే.
ఆ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు గట్టిగానే పోరాడినప్పటికీ.. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఉప్పల్ స్టేడియంలో రెండోసారి తలపడబోతున్నాయి. ఇక, హోం గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ని మరోసారి విజయం వరిస్తుందా? లేదంటే బెంగళూరు గెలుపు బాటపడుతుందా? అనేది రేపటి వరకు వేచిచూడాలి మరి.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications