హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హద్దు దాటితే చర్యలు తప్పవు: నార్త్‌జోన్‌ డీసీపీ హెచ్చరిక, నేరాలు తగ్గాయన్న ఆనంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి వేడుకలు సంబరంగా చేసుకోవచ్చనీ.. అయితే, యువతీయువకులు హద్దులు దాటితే మాత్రం కఠినచర్యలు తప్పవని హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు.

జనవరి 1న ఉదయం ఒంటిగంట వరకే వేడుకలు జరుపుకోవాలని.. ఎవరైనా వెకిలి చేష్టలకు పాల్పడినా, మద్యం తాగి వాహనాలు నడిపినా, యువతులను వేధించినా, బైక్‌ రేసింగ్‌లకు పాల్పడినా కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదేవిధంగా వేడుకల సమయంలో ఏ దుకాణదారుడైనా తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తే కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలు నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు పోలీసుల నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో డీజేలను నిషేధించినట్లు తెలిపారు.

Hyderabad north zone dcp suggetions to youth on December 31st

ఈ ఏడాది నేరాలు తగ్గాయి, షీ టీంలతో ఈవ్ టీజింగ్ తగ్గింది: సీవీ ఆనంద్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గిపోయాయని సైబారాబాద్ సీపీ సీవీ ఆనందర్ వెల్లడించారు. ఏడాదిలో జరిగిన నేరాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గాయన్నారు.

‘రాష్ట్రంలోనే అత్యధిక రికవరీలు సైబరాబాద్ పరిధిలోనే జరిగాయి. అతి తక్కువ మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల సమస్యలు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. చోరీ కేసుల్లో 79 శాతం రికవరీ చేశాం. ఫిర్యాదుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది' అని చెప్పారు.

ఎల్బీనగర్ పరిధిలో ఈ ఏడాది 8,600కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. కందుకూరు పరిధిలో తక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. షీటీమ్స్‌తో ఈవ్‌టీజింగ్ తగ్గింది. ఈ ఏడాది 3896 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సైబరాబాద్ పరిధిలో 420 చైన్‌స్నాచింగ్ కేసులు నమోదు చేశాం' అని సీవీ ఆనంద్ తెలిపారు.

ట్రాఫిక్ పోలీసుల పని తీరు అద్భుతమని, అందరి సమన్వయంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహిళలపై వేధింపులను అరిక్టేందుకు ఏర్పాటైన షీ టీంలతో ఈవ్ టీజింగ్ తగ్గిందన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలో ఆస్తి తగాదాలు అధికమయ్యాయని చెప్పారు. మహిళల భద్రతకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.

English summary
Hyderabad north zone dcp Prakash Reddy on Tuesday given some suggestions to youth on December 31st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X