Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

Hyderabad: విమానం ఆలస్యం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం మూడు గంటలు ఆలస్యం కావడతో ప్రయాణికులు ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విమానం ఆలస్యం గురించి తమకు స్పైస్‌‌జెట్ సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.

అయితే, విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఆలస్యమైందని స్పైస్ జెట్ సిబ్బంది వెల్లడించారు. విమానం ఆలస్యం అనే సమాచారాన్ని తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రయాణికులు ప్రశ్నించారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కూడా ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెసిందే.

Hyderabad Passengers protest at Shamshabad airport due to flight delay

ఫిబ్రవరి 7న కూడా ప్రయాగ్​రాజ్ వెళ్లాల్సిన విమానం ఐదున్నర గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆరోజు ఉదయం 10.30కు ప్రయాగ్​రాజ్ వెళ్లాల్సిన విమానం ఐదున్నర గంటలు ఆలస్యమైంది.

ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐదు గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విమానం సాయంత్రం 4 గంటలకు వెళ్తుందని యాజమాన్యం తెలిపింది. దీంతో ఐదుగంటల ఆలస్యంగా విమానం బయల్దేరింది.

కాగా, విమాన ప్రయాణికుల జాబితాలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇద్దరు ఐఏఎస్, 8 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఎట్టకేలకు ఐదుగంటల తర్వాత విమానం ప్రయాగ్ రాజ్ బయల్దేరడంతో ప్రయాణికులు ఊరట చెందారు. వీరంతా కుంభమేళాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+