బతికుండగానే తల్లిని చంపేశాడు, తల్లి ఏం చేసిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లి చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్ సంపాదించారు. బతికున్నప్పుడే చనిపోయినట్టుగా సర్టిఫికెట్ సంపాదించారు. ఆస్తి కోసం ఈ రకంగా వ్యవహరించారని పోలీసుల విచారణలో తేలింది.

అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల మమకారాన్ని కొడుకులు మరిచిపోతున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికోసమే అనాగరికంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. బతికుండగానే తల్లిదండ్రులను చంపేస్తున్నారు.

Hyderabad police arrested Jandhyala Vishnukumar for fake death certificate

బతికుండగానే ఇంటి నుండి స్మశానంలోనో, వృద్దాశ్రమంలో వదిలేసిన ఘటనలు అనేకం చూశాం, విన్నాం. అయితే ఆ తరహా ఘటనలకు ఈ ఘటన చాలా భిన్నం. ఆస్తి కోసం బతికుండగానే తల్లి చనిపోయిందంటూ కొడుకు డెత్ సర్టిఫికెట్ ను తీసుకొచ్చారు.

హైద్రాబాద్ లోని నేరేడ్ మెట్ కు చెందిన ఓ తనయుడు ఈ తతంగాన్ని నడిపాడు. తల్లిదండ్రులుసంపాదించిన ఆస్తిని దక్కించుకోవడం ఆయన ఈ సర్టిఫికెట్ తెచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకొన్న తల్లి ప్రసూనాంబ పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే పోలీసులు నిందితుడు జంద్యాల విష్ణుకుమార్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad police arrested Jandhyala Vishnukumar for fake death certificate.he created a fake death certificate of his mother Prasunamba.she complaint agaisnt him, police arrested vishnu kumar.
Please Wait while comments are loading...