Allu Arjun: అల్లు అర్జున్ కు హైదరాబాద్ పోలీసుల బంపర్ ఆఫర్.. !

పుష్ప2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట తర్వాత అందులో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్లేందుకు హీరో అల్లు అర్జున్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తొలుత న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. తాజాగా పోలీసులు ముందుకొచ్చినా అల్లు అర్జున్ చివరి నిమిషంలో టూర్ రద్దు చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చారు.

Hyderabad police issue another notice to allu arjun offered arrangements for kims visit

తాజాగా సికింద్రాబాద్ రాంగోపాల్ పేట సీఐ పేరుతో అల్లు అర్జున్ కు నోటీసు పంపారు. ఇందులో రాంగోపాల్ పేటతో పాటు నార్త్ జోన్ పోలీసులు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేశారు. నిన్న ఉదయం 10.30 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఇందులో తెలిపారు. ఆస్పత్రి వద్ద జనానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించబోనని మీరు చెప్పడం వల్లే ఈ ఏర్పాట్లు చేశామన్నారు.

కానీ చివరి నిమిషంలో మీ మేనేజర్ ఫోన్ చేసి కిమ్స్ ఆస్పత్రిలో బాబును, అతని తండ్రిని పరామర్శించేందుకు రావడం లేదని సమాచారం ఇచ్చారని రాంగోపాల్ పేట సీఐ తెలిపారు. ఇప్పటికీ తాము అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళ్లానంటే బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే మీ పర్యటన రహస్యంగా ఉంచితే ఆస్పత్రి వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. మీ టూర్ కు రాంగోపాల్ పేట పోలీసులు తగిన భద్రత ఏర్పాటు చేస్తారని కూడా తెలిపారు. తద్వారా శాంతియుతంగా మీరు వచ్చి వెళ్లొచ్చిన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+