స్పా,సెలూన్ ముసుగులో వ్యభిచారం... పక్కా సమాచారంతో గుట్టు రట్టు చేసిన పోలీసులు...

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పరిధిలో సెలూన్,స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార దందాలను పోలీసులు బట్టబయలుచేశారు. పక్కా సమాచారంతో రెండు 'స్పా'లపై దాడులు చేసి నిర్వాహకులు,సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌లోని కిమ్‌ బ్యూటీ అండ్‌ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పాపై దాడులు చేసిన పోలీసులు.. ఓ సెక్స్ వర్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ కోసం ఆమెను నియమించుకున్నట్లు గుర్తించారు. అసలు స్పాలో ప్రొఫెషనల్ థెరపిస్ట్ ఎవరూ లేరని గుర్తించారు. ఎక్కడా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. స్పా నిర్వాహకుడు కిమ్‌తో పాటు ఆయన కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 hyderabad prostitution in the name of spa and saloon police busted it

మరో ఘటనలో,బంజారాహిల్స్ రోడ్ నం.10లో వీఎన్ బ్యూటీ స్టూడియోలో వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలుచేశారు. స్టూడియోపై దాడులు నిర్వహించి నలుగురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. వారిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం నగరంలోని కేపీహెచ్‌బీలోనూ మసాజ్‌ సెంటర్‌ ముసుగులో సాగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. వ్యభిచారం చేస్తున్న యువతులతో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Recommended Video

    మంత్రి మల్లారెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేసిన రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌లో తరచూ వ్యభిచార ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. గత నెలలో హైదరాబాద్ సరూర్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. సరూర్‌ నగర్‌లోని ఓ ఇంట్లో చందన నాగ రవిరాజా,చందన సునీత అలియాస్ అనూష అనే భార్యాభర్తలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఓ విటుడిని,యువతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారితో పాటు రవిరాజా,సునీతలను అరెస్ట్ చేశారు.ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట్ చేసి... బలవంతంగా వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పలు ప్రాంతాల నుంచి యువతుల అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు వెల్లడైంది. పక్కా ప్లాన్‌తో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వ్యభిచార దందాను బట్టబయలు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+