హైదరాబాద్ వర్షాలు: కేసీఆర్ సర్కార్ కి కార్టూన్ తో బీజేపీ అదిరిపోయే కౌంటర్!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం పడితే చాలు రోడ్లు జలాశయాలను తలపిస్తాయి. దీంతో నగర జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు చోటుచేసుకుంటాయి. ఈ కారణంగా హైదరాబాద్ వాసులకు వర్షం పడుతుంది అంటేనే ఆందోళన నెలకొంటుంది.
హైదరాబాద్ నగరంలో ఏళ్ల తరబడి వర్షాల కారణంగా ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నా, సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అన్న చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరాన్ని లండన్ లా, అమెరికాలోని డల్లాస్ లా అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అయితే అప్పటి నుంచి ఇప్పటికీ హైదరాబాద్లో పరిస్థితులు ఏం మారలేదు. విశ్వ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని బి ఆర్ ఎస్ నేతలు చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. చినుకు పడితే చాలా హైదరాబాద్ నగరం ఇంకా చిత్తడిగానే మారుతుంది. డ్రైనేజీలు రోడ్లమీదనే ప్రవహిస్తున్నాయి. చాలా కాలనీలు మోకాళ్ళ లోతు నీళ్లలో మునిగిపోతున్నాయి. నగర రహదారులన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి.
దీంతో తాజాగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బిజెపి నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని రోడ్లను చూపి, లండన్ , అమెరికా రోడ్లా ఇవి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఒక సెటైరికల్ కార్టూన్ బిజెపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి నగరవాసులు ఆలోచించేలా చేసింది.
హైదరాబాద్ కు సముద్రం తీసుకొస్తానని.
— BJP Telangana (@BJP4Telangana) July 22, 2023
దానిని మన కేసీఆర్ గారు నిజం చేశారు.#HappeningHyderabad ? pic.twitter.com/nTw6wpwunM
హైదరాబాద్ కు కెసిఆర్ గారు సముద్రం తీసుకొస్తానని చెప్పి దానిని నిజం చేశారంటూ సెటైరికల్ పోస్ట్ చేసింది. హైదరాబాద్ రోడ్లమీద ప్రయాణం చేయాలంటే బోటులో గొడుగు వేసుకుని ప్రయాణం చేయాలని ఒక కార్టూన్ వేసి హైదరాబాద్ టూర్స్ అని రాసి థాంక్స్ కెసిఆర్ సార్ అంటూ ఒక కార్టూన్ పోస్ట్ చేసింది.
వరంగల్ అభివృద్ధి ఏమాయే కేసీఆర్ ?
— BJP Telangana (@BJP4Telangana) July 22, 2023
వానొచ్చిన ప్రతీసారీ ప్రజల్లో వరదభయంతో వణుకుతూనే ఉన్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వరంగల్ రాత మారదా?#KCRfailedCm pic.twitter.com/VGt6gd6I9D
ఇక వరంగల్లోని పరిస్థితులు ఏమీ మారలేదని, వాన వచ్చిన ప్రతిసారి ప్రజలు వరద భయంతో వణుకుతూనే ఉన్నారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని బిజెపి పేర్కొంది. వరంగల్ రాత మారదా అంటూ అప్పుడు కెసిఆర్ మాట్లాడిన మాటలు వీడియో ని, తాజా పరిస్థితులను పోస్ట్ చేసి కెసిఆర్ ను టార్గెట్ చేసింది.












Click it and Unblock the Notifications