హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ డిజిటల్-దేశంలో ఫస్ట్: శంషాబాద్ పోర్ట్‌లో ఈ-బోర్డింగ్, 'అమెరికా వర్సిటీలపై జాగ్రత్త'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సోమవారం నాడు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆధునిక సౌకర్యం వల్ల ప్రయాణికుల బోర్డింగ్‌కు సంబంధించి డిజిటలైజేషన్‌లో భాగంగా బోర్డింగ్ కార్డు కీయోస్కీ సెంటర్ల నుంచి జారీ అవుతుంది. ఇప్పటి వరకు ప్రయాణికులు నిర్ణీత ప్రయాణ సమయం కంటే గంట ముందుగా వెళ్లి క్యూలైన్‌లో నిల్చుని తమ వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సి ఉండేది.

ఈ-బోర్డింగ్ సదుపాయంతో ఇకపై ఆ ఇబ్బంది తప్పనుంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాదును ఎంపిక చేశారు. రాజు మాట్లాడుతూ... దేశీయ విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ-బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. ఇలాంటి సౌకర్యం కోసం బెంగళూరు విమానాశ్రయం వంటివి పోటీ పడ్డాయని, దేశంలోని మిగతా విమానాశ్రయాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ-బోర్డింగ్ విధానం ఏర్పాటు చేసినట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు.

తర్వాత బెంగుళూరు, ఢిల్లీ విమానాశ్రయాలలోను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విధానంలో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యముంటుందని, భద్రతాపరంగా ఇది పటిష్టమైనదని వివరించారు. కేవలం ఆధార్, స్మార్ట్‌ఫోన్ మెసేజ్‌లతో త్వరితగతిన తనిఖీ పూర్తిచేసుకొని టర్మినల్ వరకు చేరుకోవచ్చన్నారు.

Hyderabad's RGIA becomes first airport to offer e-boarding facility

ఈ-బోర్డింగ్ అంటే..

దేశంలోనే తొలిసారి శంషాబాద్‌లో ప్రవేశపెట్టిన ఈ-బోర్డింగ్ విధానంలో టిక్కెట్టు కొన్న విమానయాన ప్రయాణికులకు ఆయా ఎయిర్ లైన్స్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లో మెసేజ్ వస్తుంది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్ మెసేజ్, ఆధార్‌లను విమానాశ్రయ ప్రవేశం వద్ద భద్రతాధికారులకు చూపిస్తే చాలు.

విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ-బోర్డింగ్ మిషన్ వద్ద తమకు ఇచ్చిన ఈ-బోర్డు కార్డును పంచ్ చేసుకున్న తర్వాత నేరుగా ఎయిర్ క్రాఫ్ట్ వరకు వెళ్లవచ్చు. ఈ-బోర్డింగ్‌తో సౌలభ్యం, సమయం ఆదా అవుతుంది. తనిఖీల ఇబ్బందులు ఉండవు.

అమెరికా వర్సిటీలపై జాగ్రత్తగా ఉండాలి

అమెరికా వర్సిటీల పైన విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అశోక్ గజపతి రాజు సూచించారు. విద్యార్థులు సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలని చెప్పారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్ పాలిటెక్నిక్ వర్సిటీ వివాదం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గజపతి రాజు స్పందించారు.

English summary
GMR group-run Rajiv Gandhi International Airport (RGIA) today became the first airport in the country to offer e-boarding facility to domestic fliers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X