టార్గెట్ ఒలింపిక్స్: హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కెటిఆర్ ముఖాముఖి(పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. వచ్చే 15-20 ఏళ్లలో కచ్చితంగా భారత్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుందని, తనకా నమ్మకం ఉందని అన్నారు. అందుకు వేదిక హైదరాబాదే కావాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని, అయితే, ఆ స్థాయికి రావాలంటే క్రీడల పరంగా చాలా అభివృద్ధి జరగాల్సి ఉందని కేటీఆర్ అన్నారు.
మంగళవారం శిల్పారామంలో ‘హైదరాబాద్ బ్రాండ్' పేరిట ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చెప్పింది చేసి చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
రింగ్ర రోడ్డు అవతల 285 కిలో మీటర్ల ప్రాంతీయ వలయ రహదారిని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను వికేంద్రీకరిస్తామన్నారు. రెండు రింగ్ రోడ్ల మధ్యలో ఏర్పాటు చేసే సమూహాల్లో శాటిలైట్ టౌన్‌షిప్స్, పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 3.5 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు.
నగరంలోని 20 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి నాలుగు చొప్పున ఎల్‌ఈడీ దీపాలను ఉచితంగా లేదా రాయితీపై అందజేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. భాగ్యనగరంలో కుటుంబాలతో కలిసి వారాంతపు సెలవుల్లో సేద తీరేందుకు వీకెండ్ స్పాట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో గండిపేటను వీకెండ్ స్పాట్‌గా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనపై చిత్తశుద్ధితో ఉన్నామని, వెనకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కూడళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 400 కి.మీ.ల వైట్ ట్యాపింగ్ రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు.
మూసీ పొడవునా 42 కి.మీ. ఆరు వరసల రహదారి అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై రక్షణ శాఖకు లేఖ రాశామన్నారు. కంటోన్మెంట్ అధికారులు అంగీకరిస్తే రింగ్ రోడ్డు అవతల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
వచ్చే 15-20 ఏళ్లలో కచ్చితంగా భారత్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుందని, తనకా నమ్మకం ఉందని అన్నారు. అందుకు వేదిక హైదరాబాదే కావాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని, అయితే, ఆ స్థాయికి రావాలంటే క్రీడల పరంగా చాలా అభివృద్ధి జరగాల్సి ఉందని కేటీఆర్ అన్నారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
మంగళవారం శిల్పారామంలో ‘హైదరాబాద్ బ్రాండ్' పేరిట ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చెప్పింది చేసి చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
నగర విద్యుత్ అవసరాల కోసం 2400 మెగావాట్ల పవర్ ఐలాండ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
భవిష్యత్తులో హైదరాబాద్ జనాభా పదింతలు పెరిగినా తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేసేందుకు మిషన్ భగీరథలో భాగంగా 30 టీఎంసీల సామర్థ్యం గల రెండు రిజర్వాయర్లను నిర్మించనున్నట్లు తెలిపారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
రింగ్ర రోడ్డు అవతల 285 కిలో మీటర్ల ప్రాంతీయ వలయ రహదారిని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను వికేంద్రీకరిస్తామన్నారు.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
రెండు రింగ్ రోడ్ల మధ్యలో ఏర్పాటు చేసే సమూహాల్లో శాటిలైట్ టౌన్‌షిప్స్, పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 3.5 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications