For Daily Alerts
మెంటల్ కృష్ణ, హైదరాబాద్‌లో తిరగనివ్వం: పోసానికి గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ చీఫ్ హెచ్చరిక
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీపై టీడీపీ హైదరాబాద్ అధ్యక్షులు ఎంఎన్ శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను మెంటల్ కృష్ణగా అభివర్ణించారు.


Posani Krishna Murali Press Meet | Oneindia Telugu
చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారని అన్నారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్‌లా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పోసానికి దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరాలన్నారు.
కాగా, అంతకుముందు పోసాని ప్రెస్ మీట్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్‌కు హుటాహుటిన వచ్చారు. అయితే, ఈలోగానే ప్రెస్ మీట్‌ను ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!