Hyderabad: బిర్యానీలోకి అదనంగా పెరుగు అడిగిన కస్టమర్‌పై దాడి, మృతి

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో విషాదం నెలకొంది. బిర్యానీ తినేందుకు హోటల్‌కు వచ్చిన ఓ కస్టమర్‌పై సిబ్బంది తీవ్రంగా దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్‌లో ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే పాతబస్తీ చాంద్రాయణగుట్టకి చెందిన లియాకత్‌ అనే వ్యక్తి పంజాగుట్టలోని మెరిడియన్‌ హోటల్‌లో బిర్యానీ తినేందుకు వచ్చాడు. బిర్యానీలోకి అదనంగా పెరుగు తీసుకురావాలని హోటల్‌ సిబ్బందిని అడగడంతో గొడవ మొదలైంది. దీంతో లియాకత్‌పై హోటల్ సిబ్బంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

Hyderabad: teeanager died after a restaurant staff attacked on him, for asking extra curd in biryani

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. లియాకత్‌తో పాటు మెరిడియన్‌ హోటల్‌ సిబ్బందిని కూడా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీస్‌ స్టేషన్‌లో మాట్లాడుతుండగానే లియాకత్‌ స్పృహకోల్పోయాడు. వెంటనే పోలీసులు అతడ్ని స్థానికంగా ఉన్న డెక్కన్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, దాడిలో తీవ్రంగా గాయపడిన లియాకత్.. చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోలీసులు అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు డెక్కన్ ఆస్పత్రి దగ్గరికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దాడి జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతోనే లియాకత్‌ మృతి చెందాడని అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్‌బేగ్‌ చేరుకుని పోలీసులతో మాట్లాడారు.

బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెరిడియన్‌ హోటల్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హోటల్ సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అదనంగా పెరుగు అడిగితే దాడి చేసి చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+