దొరికిన టెక్కీ సహా హైదరాబాదీ: ఆకలితో అలమటించిన ట్రెక్కర్స్

బెంగళూరు: కర్ణాటకలో అదృశ్యమైన హైదరాబాదీ ట్రెక్కర్స్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో వారి ఆచూకీని కనిపెట్టారు. 48 గంటల గాలింపు చర్యల తర్వాత వారి ఆచూకీని పోలీసులు, నక్సల్స్ నిరోధ బలగాల సిబ్బంది కనిపెట్టారు.

ఆదివారంనాడు వారు కర్ణాటకలో అదృశ్యమైన విషయం తెలిసిందే. చిక్కమంగళూరులోని తనిగెబైలు అటివీ ప్రాంతంలోని హెబ్బె జలపాతం వద్ద వారిద్దరు కనిపించారు. తన్నిగెబైలు అటవీ ప్రాంతం భద్ర పులుల అభయారణ్యంలో ఉంటుంది.

Hyderabad trekkers found tired and hungry

వివేక్ గుప్తా (31), శశిధర్ (27) అనే ఇద్దరు హైదరాబాదీ ట్రెక్కర్ల ఆచూకీ దొరికినట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. వీరిలో ఒకతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బట్టలు చిరిగి, నిరాశాజనకమైన స్థితిలో కనిపించినట్లు తెలిపారు.

జలగలు కొరికిన గుర్తులు కూడా వారి దేహాలపై ఉన్నాయి. ఆదివారం నుంచి వారికి ఆహారం లేదు. రోడ్డు కోసం వెతుకుతూ వారు దారి తప్పారు. గుప్తా ల్యాబ్ టెక్నీషియన్ కాగా, శశిధర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. పదకొండు మంది సభ్యులతో కలిసి వారు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. మిగతా బృందం నుంచి వేరైనా వారు దారి తప్పి కెమ్మనగుండి వైపు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+