హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి రాష్ట్రపతి అవార్డు
న్యూఢిల్లీ: అత్యున్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ తొలిసారి రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బుధవారం ఆ అవార్డును అందుకుంది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జరిగిన బుధవారం కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ హరిబాబుకు ఈ అవార్డు ట్రోఫీని అందజేశారు.
1974 అక్టోబర్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ కేంద్రంగా ఏర్పాటైన హైదరాబాద్ యూనివర్సిటీకి నాలుగు పాయింట్ల న్యాక్ స్కేల్‌లో 3.72 పాయింట్ల రేటింగ్ లభించింది.

ఇక ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు విజయ్ కే చౌదరి, అమితా గుప్తా బెస్ట్ విజిటర్స్ అవార్డును అందుకున్నారు. బయో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వీరిద్దరు టీబీ నిర్ధారణకు వేగవంతమైన పరీక్ష కోసం మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్‌క్యులోసిస్ (ఎంటీబీ)పై జరిపిన పరిశోధనకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఇతర పరిశోధనలకుగాను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన మరో నలుగురు పరిశోధకులు అవార్డులను అందుకున్నారు.












Click it and Unblock the Notifications