మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్ కెమెరా కలకలం... జూబ్లీహిల్స్‌ ఫుడ్ కోర్టులో వెలుగుచూసిన ఘటన...

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ ఫుడ్ కోర్టులో మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా కలకలం రేపింది. ఫుడ్ కోర్టుకి వెళ్లిన ఓ మహిళ వాష్‌రూమ్‌కి వెళ్లగా... అక్కడ ఓ మూలకు సెల్‌ఫోన్ కనిపించింది. సెల్‌ఫోన్ అక్కడెందుకు ఉందా అని చూడగా... దాని కెమెరా ఆన్ చేసి ఉన్నట్లు గుర్తించింది. మహిళలను ఆ సెల్‌ఫోన్‌తో రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఫుడ్ కోర్టులో బాత్‌రూమ్ క్లీనర్‌గా పనిచేస్తున్న బెనర్జీనే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ఆ మహిళ బాత్‌రూమ్‌లో కెమెరాను గుర్తించేవరకూ... అది రికార్డు మోడ్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మద్యం మత్తులో మహిళ దారుణ హత్య :

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ముషంపల్లి గ్రామంలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మృతురాలిని ధనలక్ష్మి(54)గా గుర్తించారు. స్థానికంగా ఉండే లింగయ్య,పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు. మహిళ వివస్త్రను చేసి దారుణంగా హతమార్చి పరారయ్యారు.

hyderabad woman finds secret camera food court bathroom

ధనలక్ష్మి స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతోంది.అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య యాదవ్,పుల్లయ్యలు తాగుడుకు బానిసలై జులాయిగా తిరుగుతున్నారు. గతంలో పుల్లయ్య తన భార్యను హతమార్చి జైలుకు వెళ్లి వచ్చాడు. లింగయ్య యాదవ్ నిత్యం తాగుతూ భార్యను కొడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఇద్దరు బుధవారం ధనలక్ష్మి కిరాణం వద్దకు వెళ్లి... ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై ఆమెను హతమార్చి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుని అక్కడినుంచి పారిపోయారు.ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

హత్యకు పాల్పడిన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఆ మహిళ ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమ్యాయని... దీంతో మద్యం మత్తులో ఆభరణాల కోసమే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు లింగయ్య, పుల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అశ్వారావుపేటలో గంజాయి కలకలం :

ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో డ్రగ్స్ కలకలం రేగింది. స్థానిక పేరాయిగూడెం పుల్లల బజారులో మరియమ్మ అనే మహిళ ఇంట్లో పోలీసులు నిషేధిత గంజాయిని గుర్తించారు. దాదాపు రెండున్నర కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ 2018లోనూ గంజాయి విక్రయిస్తు పట్టుబడినట్లు తెలుస్తోంది. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+