అమెరికాలో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి: మంత్రాల నెపంతో..

హైదరాబాద్: అమెరికాలోని ఇటోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి అభిషేక్‌రెడ్డి మృతి చెందాడు. అభిషేక్ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. కారు ప్రమాదంలో మృతి చెందిన అభిషేక్‌రెడ్డి మునుగోడు మండలం కొరటికల్లు గ్రామానికి చెందినవాడు. దీంతో మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

మంత్రాలు వేస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంటిపై దాడి చేసి,వ్యక్తిని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన దుబ్బాక మండలంలోని చిన్ననిజాంపేటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంఘం బాలయ్య(62), మంత్రాలు చేయడం మూలంగా చాలామంది అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారని అనుమానిస్తుండగా, ఇదేక్రమంలో గ్రామానికి చెందిన సంఘం రాములు కూతురు లావణ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.

తమ కూతురు అనారోగ్యానికి గురి కావడానికి బాలయ్యనే కారణమంటూ, లావణ్య తండ్రి రాములు, ఆమె భర్త రమేశ్, మరికొందరు బంధువులు గ్రామస్తుల సహకారంతో కలిసి శుక్రవారం బాలయ్య ఇంటిపై దాడి చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కుటుంబసభ్యులందరిపైనా దాడి చేసి గాయపరిచారు.

Hyderabadi dies in Guntur district

దీంతో భయపడి బాలయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. తనను ఏమి చేయవద్దని ఎంత బతిమాలినా వినకుండా గొడ్డలి, గడ్డపార, కట్టెలతో తలుపులను బద్దలు కొట్టారు. ఇక గొడ్డలితో బాలయ్య మెడపై అతికిరాతకంగా నరకడంతో అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.

ఈ దాడిలో మృతుడి భార్య మల్లవ్వ, కుటుంబసభ్యులు బాలరాజు, కరుణాకర్, నారాయణ, లక్ష్మి, కవిత, వెంకవ్వలపై దాడి చేశారు. ఇందు లో బాలరాజు చేయి విరిగింది. సమాచారం అందుకున్న దుబ్బా క సీఐ రామకృష్ణారెడ్డి, భూంపల్లి ఎస్‌ఐ ప్రసా ద్, మిరుదొడ్డి ఎస్‌ఐ సతీశ్‌లు సిబ్బందితో వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా దాడిలో గాయపడిన వారిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా దవాఖానకు పంపించారు.

గ్రామానికి చెందిన సంఘం రాములు, పిట్ల రమేశ్(నస్కల్), ఎల్లయ్య, చంద్రం, సత్యనారాయణ, పోచయ్య, రంజిత్, లావణ్యలు తదితరులు(పదకొండు మంది) తమ ఇంటిపై దాడి చేసిన తన తండ్రిని గొడ్డలితో దారుణంగా నరికి చంపినట్లు మృతుడికొడుకు నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు పరారీలో ఉన్నట్లు గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు చెప్పారు. బాలయ్య మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+