హైదరాబాద్ ట్రాఫిక్ కు గుడ్ బై..! ఆ ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటుపై కీలక ముందడుగు..
హైదరాబాద్ మహా నగరం విశ్వ నగరంగా రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని మహా నగరాల్లో భాగ్యనగరం ప్రస్తుతం 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా పేరుగాంచింది. భాగ్యనగరంలో జనాభా నిత్యం గణనీయంగా పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ లో ఇలా ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది.
అటు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య 85 లక్షల 22 వేల 286 కు చేరినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య గణనీయంగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ కారణంగా నిత్యం ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లే వాళ్లు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా ముందుకెళుతోంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం మాత్రమే కాకుండా టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలంటూ HMDA గతంలోనే టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది.
తాజాగా మూడు కంపెనీలు ముందుకు వచ్చాయి. 2026లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబుల్ కారు అందుబాటులోకి వస్తే పాత బస్తీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే భువనగిరి కోటపైనా రోప్ వే టూరిజంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ. 56.81 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనుండగా.. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు.

గాలిలోనే ప్రయాణించే ఈ రోప్ వేలో ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో ఒకే సారి నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు ట్రావెల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఓవైపు ట్రాఫిక్ సమస్యలను నియంత్రిస్తూనే.. మరోవైపు ఈ ప్రాజెక్టుతో టూరిస్టులను, విదేశీయులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications