ప్రణయ్ హత్యకేసులో సంచలన విషయాలు చెప్పి అది పరువుహత్య కాదన్న హైడ్రా కమీషనర్
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు తీర్పు ఈరోజు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈరోజు తీర్పుని చెప్పిన విషయం తెలిసిందే ఈ కేసులో ఏ 2 గా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ప్రణయ్ హత్య కేసుపై హైడ్రా కమీషనర్ రంగనాథ్
ఇదే సమయంలో ప్రణయ్ పరువు హత్య పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇక తాజాగా కోర్టు తీర్పు పై రంగనాథ్ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ కేసు కావడంతో మిర్యాలగూడ డిఎస్సీ శ్రీనివాసరావు టీం సమర్థవంతంగా పని చేశారని రంగనాథ్ తెలిపారు.

ప్రణయ్ హత్య కేసులో ఏం చేశారో చెప్పిన రంగనాథ్
పూర్తి టెక్నాలజీ ఆధారంగా ఈ కేసును చేదించినట్టు, దాదాపు 8 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగిందన్నారు. కాల్ డేటా మొదలుకొని ప్రతి అంశంలోను జాగ్రత్త వహించినట్టుగా రంగనాథ్ తెలిపారు. తాము కేసు దర్యాప్తులో ఎక్కడ వెనక్కి తగ్గలేదని, దర్యాప్తులో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్లామన్నారు. కోట్ల రూపాయల సుఫారీ తో కూడుకొని ఉన్న వ్యవహారం కావడంతో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఫైల్ చేసినట్టుగా తెలిపారు.
కేసులో వారి సహకారం కీలకం
చార్జి షీట్ కు ముందే ముందు ముందు ఏమేమి జరుగుతుంది అన్నదానిపైన గంటలు తరబడి చర్చలు జరిగాయని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయనేది దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లామని తెలిపారు. అప్పటి డీజీ మహేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారుల సహకారం తమకు ఉందని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకేసులో సాక్షులుగా ఉన్నవారు వారేం చెప్పారో అదే విషయానికి చివరి వరకు కట్టుబడి ఉన్నారని రంగనాథ్ వెల్లడించారు.
అది పరువు హత్య కాదు, కాంట్రాక్ట్ మర్డర్
అమృత, ప్రణయ్ తల్లి ప్రేమలత ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగలేదని చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారని పేర్కొన్నారు. అయితే 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఈ హత్య పరువు హత్యగా ప్రచారం జరిగిందని అయితే తాము పోలీసులుగా ఆ విషయాన్ని అంగీకరించలేమన్నారు. అది పరువు హత్య కాదన్నారు. ఒక కులానికి ఎక్కువ పరువు మరో కులానికి తక్కువ పరువు ఉండదని అది కాంట్రాక్టు మర్డర్ అని రంగనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వారంతా తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న వారే
కోట్ల రూపాయల లావాదేవీలతో ఈ హత్య జరిగిందని ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న వారంతా తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న వారని రంగనాధ్ తెలిపారు. అన్ని ఆధారాలతో 1600 పేజీల చార్జ్ షీట్ వేశామని ఎవరెన్ని విమర్శలు చేసిన పట్టించుకోకుండా పోలీసులు ముందుకు వెళ్లి ఈ కేసును చేదించినట్టుగా రంగనాథ్ తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications