షాకిచ్చిన హైడ్రా మార్షల్స్.. గ్రేటర్ హైదరాబాద్ లో సేవలు బంద్!
హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ లో దీనిని ఏర్పాటు చేసిన నాటి నుండి హైదరాబాద్ లో విపత్తు నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమణల నుండి కాపాడడానికి పనిచేస్తున్న వ్యవస్థ హైడ్రా.
విపత్తుల నిర్వహణ,ఆక్రమణలపైన హైడ్రా
ఆక్రమణలపైన చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్న హైడ్రా 2024 జూన్ 27వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోని అనేక ఆక్రమణలను కూల్చి వేసింది. కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, మాదాపూర్ సున్నం చెరువు వంటి ఆరు ప్రముఖ చెరువులను పునరుద్ధరించే పని చేపట్టింది. ఇక హైడ్రా వర్షాకాలంలో విపత్తుల నిర్వహణ కూడా చేయనుంది.

హైడ్రా నుండి ఒక కీలక ప్రకటన
అయితే తాజాగా హైడ్రా నుండి ఒక కీలక ప్రకటన వచ్చింది. హైదరాబాద్ మార్షల్స్ గా పని చేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు జీతాలు తగ్గించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలో విపత్తుల నిర్వహణ ఆస్తుల పరిరక్షణ కోసం వీరు తమ విధులను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ లో వీరు అందించే ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి.
హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ
హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరించడంతో మాన్సూన్ ఆపరేషన్ పైన ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం కలగనుంది. వర్షాకాలంలో వరద సమస్యలను తగ్గించేందుకు రాత్రి పగలు కష్ట తగ్గించడం సరికాదని అభిప్రాయం వారి నుండి వ్యక్తమవుతుంది. మొత్తం 150 డివిజన్లలో హైడ్రా సేవలు నిలిచిపోయాయి. ట్రైనింగ్ కార్యక్రమాలు, ప్రజావాణి సేవలు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు
51 హైడ్రా భారీ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎమర్జెన్సీ సేవలను నిలిచిపోవడంతో నగరవాసులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మరి హైదరాబాద్ మార్షల్ విధులు బహిష్కరించడంతో, ప్రభుత్వం వీరి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications