వైసీపీకీ మొదలైన హైడ్రా షాకులు-ఆ సీనియర్ నేత ఫామ్ హౌస్ కూల్చివేత..!
హైదరాబాద్ లో చెరువులు, కుంటల్లో అక్రమనిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రా అధికారులు ఎవరినీ వదలిపెట్టడం లేదు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఇలా చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్ అక్రమ కట్టడాల్ని సైతం కూల్చేందుకు నోటీసులు ఇచ్చిన హైడ్రా.. త్వరలో చర్యలకు దిగబోతోంది. ఇదే క్రమంలో పొరుగు రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలకు సైతం షాకులిస్తోంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి హైదరాబాద్ స్వర్ణపురిలో ఉన్న ఫాంహౌస్ ను హైడ్రా కూల్చేసింది. తాజాగా సంగారెడ్ది జిల్లా అమీర్ పూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు.. కాటసానికి చెందిన ఫాంంహోస్ నూ పడగొట్టారు. భారీ బందోబస్తుతో కాటసాని ఫాంహౌస్ ను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో వైసీపీ నేతలకూ దడ మొదలైంది.

గతంలో హైదరాబాద్ నగరంలో తమ ఆస్తుల రక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంతో జగన్ అండ్ కో అంటకాగారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు ఇద్దరూ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ తో పాటు వైసీపీ నేతలకు చెందిన అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ఇదే క్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫాంహౌస్ ను కూల్చేసినట్లు తెలుస్తోంది. కాటసాని తో మొదలుపెట్టి నగరంలోని ఇతర వైసీపీ నేతల ఇళ్లు, ఆస్తులు అక్రమ కట్టడాలుగా తేలితే మాత్రం హైడ్రా కూల్చివేతలకు దిగబోతోంది.












Click it and Unblock the Notifications