అర్ధరాత్రి హైదరాబాద్ లో హైడ్రా సాహసోపేత చర్యలు.. 9 మంది ప్రాణాలు

హైదరాబాద్ లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మీరాలం ట్యాంక్‌లో మొసళ్ల మధ్య చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రక్షించారు. చీకటి, దట్టమైన కలుపు మొక్కలు, మొసళ్ల భయం వంటి ప్రమాదకర పరిస్థితుల మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ విషయంలో హైడ్రాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

భూసార పరీక్షల కోసం..

మీరాలం ట్యాంక్‌ అభివృద్ధి పనులలో భాగంగా అక్కడ ఓ భారీ వంతెన నిర్మితమౌతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భూసార పరీక్షలు కొనసాగుతున్నాయి. దీనికోసం భూసార పరీక్షలు నిర్వహిస్తున్న ఇంజనీర్లు, కార్మికులు ఆదివారం ఉదయం పడవలో సరస్సులోకి మధ్యలోకి వెళ్లారు. అక్కడ మట్టి పరీక్షలను నిర్వహించారు. వాటి నమూనాలను సేకరించారు. సాయంత్రం తిరిగి వస్తోన్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మధ్యలో పడవ ఇంజిన్ హఠాత్తుగా ఆగిపోయింది.

HYDRAA Rescue Operation saves 9 stranded workers from Crocodiles filled Mir Alam Tank in Hyderabad

మొసళ్లు, దట్టంగా పెరిగిన కలుపు మొక్కలు..

దీంతో వారంతా నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. పడవ ఒడ్డుకు చేరితేనే మరమ్మతు సాధ్యమని మెకానిక్ తెలియజేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. దట్టంగా పెరిగిన కలుపు మొక్కలు అడ్డంగా ఉండటంతో పడవను చేతులతో నెట్టడం కూడా సాధ్యం కాలేదు. కార్మికులు ఎటూ కదల్లేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చీకటి ఆవరించడంతో ఒడ్డుకు చేరుకునే మార్గం లేక కార్మికులలో భయాందోళనలు మొదలయ్యాయి.

రంగంలో దిగిన హైడ్రా..

సరస్సులో మొసళ్లు ఉన్నాయనే భయం, గంటల తరబడి చిక్కుకుపోవడంతో ఆందోళన రేకెత్తించింది. వెంటనే ఎమర్జెన్సీ నంబరు 100కి కాల్ చేశారు. దీంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది, అటవీ అధికారి జమీల్, రెస్క్యూ టీం ఇన్‌ఛార్జ్ స్వామి రంగంలోకి దిగారు. వారు చిక్కుకున్న కార్మికులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా ప్రశాంతంగా ఉండాలని ధైర్యం చెప్పారు.

టార్చీ, మొబైల్ ఫోన్ లైట్లు..

చీకట్లు ఆవరించిన విశాలమైన మీరాలం చెరువులో వారు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. సరైన ప్రదేశాన్ని గుర్తించడానికి టార్చీ, మొబైల్ ఫోన్ లైట్లను మాత్రమే వినియోగించుకోవాల్సి వచ్చింది. వారిని గుర్తించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి ప్రయత్నంలో నలుగురు కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెండో విడతలో మిగిలిన అయిదుమందినీ విజయవంతంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+