వస్తున్నా.. కొండగట్టునుంచి మొదలెడుతున్నా.. ఆశీర్వదించండి: జనసేనాని కీలక ప్రకటన

‘మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి’ అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం కీలక ప్రకటన చేశారు.

హైదరాబాద్: 'మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం కీలక ప్రకటన చేశారు. తన అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

2009లో ఎన్నికల ప్రచారంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి తాను కొండగట్టు వద్దే క్షేమంగా బయటపడ్డానని, దానికితోడు తమ కుటుంబ ఇలవేల్పు కూడా ఆంజనేయ స్వామి కావడం తన రాజకీయ యాత్రను అక్కడ్నుంచి ఆరంభించేందుకు కారణభూతమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

pawan-kalyan

సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా ప్రజల ముందుకు వస్తున్నానని, తన పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ ఆలయం ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే తన రాజకీయ యాత్రను పవన్ ఏ రోజున కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభిస్తారన్నది ఆదివారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+