సీబీఐ సమన్లు: సుజనా చౌదరి అబద్ధం చెబుతున్నారా?
హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కళ్యాణ్ శ్రీనివాస్ ఎండీగా ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.304 కోట్ల రుణాలూ నేరుగా నాలుగు కంపెనీలకు బదిలీ అయ్యాయి.
అయితే ఆ నాలుగు కంపెనీలూ ఎవరివి? వాటి వెనుక ఎవరు ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.304 కోట్లూ ఎవరి ఖాతాలోకి వెళ్లాయి!? అనే అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు కళ్యాణ్ శ్రీనివాస్ గతంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అంశంపైనా సీబీఐ అధికారులు దృష్టిసారించారు.
మరోవైపు మంగళవారం మీడియాతో మాట్లాడిన విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ నా సోదరుడు కళ్యాణ్ శ్రీనివాస్... సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్‌లో గతంలో పనిచేశారని, వారు కుట్రచేసి తమ సోదరుడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. తన సోదరుడికి అన్ని వందల కోట్లు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి సుజనా చౌదరి అన్నారు. ‘‘ఆ కంపెనీలకు ఇప్పు డు నేను డైరెక్టర్‌ను కాదు. కంపెనీల బాధ్యతల నుంచి తప్పుకొని 15 ఏళ్లయింది. సుజనా యూనివర్సల్ సంస్థ మారిషస్ బ్యాంకు నుం చి రుణం తీసుకున్నప్పుడు కూడా నేను సంతకాలు చేయలేదు. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల్లో మాత్రమే ఉన్నాను. ఆయా కంపెనీల వివాదాల గురించి సంబంధిత కంపెనీలనే అడగాలి'' అన్నారు.

అయితే సుజనా యూనివర్సల్ కంపెనీతో తనకు సంబంధం లేదంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటనలో వాస్తవం లేదంటున్నారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టడానికి ముందు వరకూ సుజనా యూనివర్సల్ తదితర కంపెనీలకు సుజనా చౌదరి డైరెక్టర్‌గా ఉన్నారు.
ఈ కంపెనీలో ఆగస్టు 22, 1986 నుంచి 2014 అక్టోబర్ 15 వరకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగారు. మారిషస్ బ్యాంకు నుంచి సుజనా యూనివర్సల్ అనుబంధ కంపెనీ హేస్టియా హోల్డింగ్స్ 2012లో రూ.100 కోట్ల రుణాన్ని తీసుకుంది. రుణం తీసుకున్న సమయంలోనూ, రుణం ఎగవేత దరిమిలా దీనిపై మారిషస్ బ్యాంకు అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించింది.
రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మోసం చేశారంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ పెట్టిన కేసులో హైదరాబాద్ 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ తనకు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆయన మాట్లాడుతూ తనకు ఎలాంటి సమన్లు అందలేదని, ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న సంస్థలో తాను డైరెక్టర్‌ను కానని చెప్పారు.
అయితే వాస్తవానికి ఈ సమయంలోనూ సుజనా యూనివర్సల్‌లో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 15 ఏళ్లుగా ఆయా కంపెనీలతో తనకు సంబంధం లేదని సుజనా ప్రకటించడంపై కంపెనీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. సుజనా గ్రూప్ కంపెనీల్లో 2014 వరకూ ఆయన చురుగ్గానే ఉన్నారు.
ఇదే గ్రూప్‌లోని మరో ముఖ్య కంపెనీ సుజనా టవర్స్‌లో ఆయన 1992 ఫిబ్రవరి 13 నుంచి 2014 అక్టోబర్ 15 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు. సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా పవర్ (గంగికొండన్) లిమిటెడ్, సుజనా పవర్ ఇండియా, సుజనా పవర్ (ట్యూటికోరిన్), సుజనా ఎనర్జీ, సుజనా ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్, సుజనా హోల్డింగ్స్ లిమిటెడ్, సుజనా ప్రాజెక్ట్స్ తదితర సంస్థలన్నింటిలోనూ 2014 అక్టోబర్ 15 వరకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగారు.
ఇవే కాకుండా ఫోస్టర్ ఇన్‌ఫిన్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 2014 అక్టోబర్ 15 వరకు, ఆఫ్‌బీట్ డెవలపర్స్ ప్రైవే ట్ లిమిటెడ్ కంపెనీలో 2010 జనవరి 29 వరకు సుజనా డైరెక్టర్‌గా ఉన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications