కొండాతో సఖ్యత లేదు, నేనే బాబును కాపాడా, మంత్రి పదవి వద్దు: ఎర్రబెల్లి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కెసిఆర్‌ను మంత్రి పదవిని అడగనని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.తనకు మంత్రి పదవిని కెసిఆర్ ఇస్తేనే తీసుకొంటానని ఆయన చెప్పారు. టిఆర్ఎస్‌పార్టీలోనే ఉన్నా తాను కొండా దంపతులతో కలిసి పని చేయడం లేదన్నారు.

అజహరుద్దీన్ మనోడేనా, రాజకీయ కుట్ర, పాకిస్థాన్ కోడై కూస్తోంది: విహెచ్ సంచలనం

టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అంశాలపై మాట్లాడారు. రాజకీయంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై దయాకర్ రావు స్పందించారు.

కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేదాలు: డి.శ్రీనివాస్

తెలుగు న్యూస్ ఛానెల్ ఎర్రబెల్లి దయాకర్ రావును శుక్రవారం నాడు ఇంటర్వ్యూ చేసింది. టిఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితులు , ప్రస్తుతం టిఆర్ఎస్ లో తనకున్న గౌరవం తదితర అంశాలను దయాకర్ రావు ప్రస్తావించారు.

పవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్‌, వైఎస్ఆర్‌ కోసం రాజీవ్‌ను ఒప్పించా: వి.హెచ్.సంచలనం

మంత్రి పదవిని వద్దని చెప్పా

మంత్రి పదవిని వద్దని చెప్పా


తనకు ఎలాంటి పదవులు వద్దని టిఆర్ఎస్ లో చేరే సమయంలోనే తాను చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఓ బహిరంగ సభలోనే మంత్రి పదవి ఇస్తానంటే నేనే వద్దన్న విషయాన్ని స్వయంగా కెసిఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.2019 ఎన్నికల్లో తనంతట గానుగా కూడ మంత్రి పదవి విషయమై కెసిఆర్ ను అడగబోనని ఆయన చెప్పారు. కసిార్ తనకు మంత్రి పదవి ఇస్తే తీసుకొంటానని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

కొందా దంపతులతో కలిసి పని చేయడం లేదు

కొందా దంపతులతో కలిసి పని చేయడం లేదు

కొండా దంపతులు, తాను ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారితో కలిసి తాను పనిచేయడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అయితే కొండా దంపతులను పార్టీ నుండి పంపించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వ్రచారాన్ని కూడ దయాకర్ రావు ఖండించారు.ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం విషయమై ఆ విషయాలు తనకు తెలియవన్నారు,. తన సోదరుడు తాను చెప్పినట్టు వింటున్నాడా అని ఆయన ప్రశ్నించారు. తన కంటే ముందే ప్రదీప్ రావు టిఆర్ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొండా సురేఖ గెలుపు కోసం ప్రదీప్ రావు పనిచేసిన విషయాన్ని దయాకర్ రావు గుర్తు చేశారు.ప్రదీప్ రావు టిఆర్ఎస్ లో చేరిన సమయంలో తాను టిడిపిలోనే ఉన్నానని ఆయన గుర్తుచేశారు.

2019లో పాలకుర్తి నుండే పోటీ చేస్తా

2019లో పాలకుర్తి నుండే పోటీ చేస్తా

2019 ఎన్నికల్లో కూడ తాను పాలకుర్తి నుండే పోటీ చేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో తనను గెలిపించిన పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉంటానని దయాకర్ రావు చెప్పారు. కీలక సమయంలో తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ది కోసం పాటుపడతానని దయాకర్ రావు చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడ తాను పాలకుర్తి నుండే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకొనేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని టిఆర్ఎస్ లో చేరే ముందు కెసిఆర్ ను కోరానని దయాకర్ రావు గుర్తు చేశారు.

తెలంగాణలో బాబు పార్టీని వదిలేశాడు

తెలంగాణలో బాబు పార్టీని వదిలేశాడు

తెలంగాణలో చంద్రబాబునాయుడు పార్టీని వదిలేశాడని దయాకర్ రావు చెప్పారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు టైమ్ కేటాయిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో ఎవరికో ఒకరికి నిర్ణయాలు తీసుకొనే అధికారాన్ని కట్టబెడితే పరిస్థితి మరోలా ఉండేదని దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.టిడిపిలో ఉన్న సమయంలో రాజకీయంగా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చని దయాకర్ రావు గుర్తు చేశారు.

బాబును నేను చాలా సమయాల్లో కాపాడా

బాబును నేను చాలా సమయాల్లో కాపాడా

చంద్రబాబునాయుడును తాను చాలా సమయాల్లో కాపాడినట్టు దయాకర్ రావు చెప్పారు. తెలంాణలో వైసీపీ అధినేత జగన్ ను అడ్డుకొన్నారని, వరంగల్ లో కూడ బాబును అడ్డుకోకుండా తాను ఎదురుతిరిగానని ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో బాబుతో సభను సక్సెస్ చేయించినట్టు దయాకర్ రావు గుర్తు చేశారు. పార్టీ అవసరాల కోసమే తాను మాట్లాడుతానని చంద్రబాబుకు తెలుసునని దయాకర్ రావు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సమయాల్లో బాబును నేనే కాపాడానని ఆయన చెప్పారు. తాను ముందే 10 టిఆర్ఎస్ లో చేరితే ఏపీలో టిడిపి తీవ్రంగా నష్టపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో కాంగ్రెస్, తెలంగాణలో టిడిపి నేతల ఆధిపత్యం

ఏపీలో కాంగ్రెస్, తెలంగాణలో టిడిపి నేతల ఆధిపత్యం


ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారు టిడిపిలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో టిడిపి నుండి వచ్చిన నేతల హవా టిఆర్ఎస్, ప్రభుత్వంలో కొనసాగుతోందని దయాకర్ రావు నవ్వుతూ చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొంటున్న పథకాలతో ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకొనే పరిస్థితి నెలకొందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I dont want minister post said Palakurthy MLA Errabelli Dayakarao on Friday at Hyderabad.He said that he will contest from Palakurthy segment in 2019 elections. A telugu news channel interviewed him on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి