వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో)

మనది అమెరికానేనా? మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. అంటూ కన్సాస్‌లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభోట్ల భార్య సునయన దుమాల ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/హైదరాబాద్: మనది అమెరికానేనా? మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. అంటూ కన్సాస్‌లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభోట్ల భార్య సునయన దుమాల ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానాలు కావాలని అన్నారు. అమెరికాలో చోటుచేసుకున్న విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్‌ కూచిభోట్ల ఉద్యోగం చేసే గార్మిన్‌ కంపెనీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన భార్య సునయన మాట్లాడారు.

ఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలుఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు

మంచి వాళ్లకు మంచి జరుగుతుందనీ, భయపడొద్దనీ శ్రీనివాస్ ఎప్పుడు చెప్పేవారని ఆమె మీడియాతో చెప్పారు. అమెరికాలో మనం భద్రంగానే ఉన్నామా? అని పదే పదే మేం ప్రశ్నించుకునే వాళ్లమన్నారు. ఎక్కడ కాల్పులు జరిగాయని పత్రికల్లో చదివినా మేము అభద్రమేనా అనిపించేది.. ఈ ఘోరంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు శ్రీనివాస్‌ భార్య సునయన.

‘I need an answer’ on how US will stops hate crimes, says wife of Indian engineer killed in Kansas

అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ఆమె సందేహాలు వ్యక్తం చేశారు.

తెలుగు టెక్కీ మృతి: 13గంటల్లో కోటి 66లక్షల విరాళాలు అందించారుతెలుగు టెక్కీ మృతి: 13గంటల్లో కోటి 66లక్షల విరాళాలు అందించారు

కాన్సాస్‌ను మా సొంత ప్రాంతంగా చేసుకున్నామని, ఒలేతాను తమ ఇంటిగా మార్చుకున్నామని సునయన తెలిపారు. ఇక్కటే ఇంటిని కట్టుకున్నామని, స్యయంగా శ్రీనివాసే ఇంటికి పెయింటంగ్ వేశారని చెప్పారు. ఏవియేషన్ రంగమంటే శ్రీనివాస్‌కు ఎంతో ఇష్టమని చెప్పారు. అమెరికా దేశానికి శ్రీనివాస్ ఎంతో చేశారని.. కానీ, ఊహించనిది జరిగిందని అన్నారు. ఇలాంటి మరణాన్ని తాను కలలో కూడా ఊహించలేదని వాపోయారు.

ఇంకో రెండు వారాల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా.. ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పిల్లలు కూడా లేరని, ఇప్పుడు శ్రీనివాస్ జ్ఞాపకాలే మిగిలాయని కన్నీంటిపర్యాంతమయ్యారు. అమెరికాలో ఇంకా ఉండటం సబబమేనా? అని అనిపిస్తోందని అన్నారు.

'బార్‌కు వెళ్లిన నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు. దాడి సమయంలో నా భర్త మద్యం తాగలేదు. విద్వేషంతోనే నిందితుడు కాల్పులు జరిపి నా భర్త ప్రాణాలు తీశాడు. శ్రీనివాస్ తల్లికి నేనేం సమాధానం చెప్పాలి' అంటూ కంటతడి పెట్టారు.

తెలుగు టెక్కీలపై కాల్పులు: అమెరికా ఖండన, 'ట్రంపే కారణం'తెలుగు టెక్కీలపై కాల్పులు: అమెరికా ఖండన, 'ట్రంపే కారణం'

రంగంలోకి భారత రాయబార కార్యలయం

మరోవైపు మృతుడు శ్రీనివాస్‌ కుటుంబానికి ఆదుకునేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. హుస్టన్‌లోని భారత కౌన్సెల్‌ జనరల్‌ అనుపమ రాయ్‌ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. శ్రీనివాస్‌ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు..

మన వాళ్లను రక్షించేందుకు.. కాల్పులకు ఎదురెళ్లి.. ఓ అమెరికా పౌరుడి సాహసంమన వాళ్లను రక్షించేందుకు.. కాల్పులకు ఎదురెళ్లి.. ఓ అమెరికా పౌరుడి సాహసం

తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్‌ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్‌ బార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.

English summary
The wife of Indian engineer Srinivas Kuchibhotla, who was shot dead in an apparent hate crime by at a bar in Olathe city, has said that she had her doubts about staying in the US but was assured by her husband that “good things happen in America”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X