ఇలాంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ని ఎప్పుడూ చూడలేదు: జానారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇలాంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ని తమ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై చర్చలో సీఎం కేసేఆర్, మంత్రులే ఎక్కువసేపు మాట్లాడారని చెప్పారు.

డిప్యూటీ స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పగా, డిప్యూటీ స్పీకర్ తీరుపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని జానారెడ్డి తెలిపారు. ఇలాంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

uttam-jana

సీఎం కారు ఎండలో పెట్టుకోవాల్సి వస్తోందని.. రూ.500 కోట్లతో కొత్త భవనం కడతారట అని జానారెడ్డి, ఉత్తమ్ ఎద్దేవా చేశారు వాస్తు కోసం వందల కోట్లు దుర్వినియోగం చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కొత్త సచివాలయం, అసెంబ్లీ అవసరం లేదని వారు తెలిపారు. రైతుల రుణాల వడ్డీభారంపై స్థానిక కాంగ్రెస్ నేతలకు ఎమ్మార్వోలకు రైతులు దరఖాస్తులు ఇవ్వాలని వారు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior Congress Leader Jana Reddy told that he never had seen this type of Speaker and Deputy Speaker. While speaking on Wednesday Jana Reddy and Uttam Kumar Reddy critisized Speaker and Deputy Speaker of Telangana Assembly. And also told that in the discussion about Farmers Problems.. CM KCR and Ministers spoke more time.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి